మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా ఆల్ టైమ్ హాట్ టాపిక్. గత నాలుగేళ్లుగా ఈ మూవీ గురించే ఊరూ వాడా చర్చ సాగుతోంది. ఇదిగో పులి.. అంటే అదిగో మేక అన్న చందంగానే ఉంది పరిస్థితి. అన్నయ్యకు స్ర్కిప్టు ఓకే చెప్పడం అంత వీజీ కాదని మన దర్శకనిర్మాతలకు ప్రాక్టికల్ గా అర్థమైంది. ఇప్పటికైనా చిరు వస్తున్నట్టా? రానట్టా? ముఖానికి రంగేసుకుంటున్నాడా? లేదా?
మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో కొందరు దర్శకరచయితలతో సాగించిన మంతనాలేవీ ఫలించలేదు. స్ర్కిప్టులెన్ని పట్టుకొచ్చినా ఇలా వచ్చి అలా వెళుతున్నాయి. దేనికీ కమిట్ కాలేని పరిస్థితి. ఇందులో కొందరు స్టార్ డైరెక్టర్లు సైతం ఇదిగో సెట్స్ కెళ్లిపోవడమే ఆలస్యం.. అన్నంత హడావుడి చేశారు. రీమేక్ కోసం ప్రయత్నించారు. కానీ ఏదీ వర్కవుటవ్వలేదు. మొన్నటి దసరా - దీపావళి పండగల కైనా తేలిపోతుందని ఆశించిన అభిమానులు ఇప్పటికీ అర్థం కాని కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అసలు చిరంజీవి నటించే మెగా సినిమా ఎప్పుడు? ఇదో నెవ్వర్ ఎండింగ్ ప్రాసెస్ అనుకోవాల్సిందేనా?
ప్రస్తుతానికైతే ఈ సినిమా గురించిన టాపిక్ మీడియా కూడా తీయడం లేదు. అయితే అప్పుడప్పుడు రామ్ గోపాల్ వర్మ పుండు మీద కారంలా ఏదో ఒక కామెంట్ విసురుతూ మెగా ఫ్యాన్స్ ని అలెర్ట్ చేస్తున్నాడు. 2014 డిసెంబర్ లో ప్రకటన అని చెప్పారు.. కాని చివరకు 2015 డిసెంబర్ వచ్చేసింది. ఇవాళ డిసెంబర్ 1వ తేదీని క్యాలెండర్ లో చూడగానే.. అభిమానులకు ఒక్కసారిగా గుండె కలుక్కుమంది.