చిరు చెప్పిన 150 ముచ్చట్లు..

Update: 2016-06-26 05:49 GMT
చిరంజీవి రీఎంట్రీ మూవీ నిజంగానే సంక్రాంతికి విడుదలవుతుందా..? ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అన్న టైటిల్ అఫీషియలేనా..? దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయబోతూ ముఖానికి రంగేసుకున్నపుడు చిరంజీవి ఎలా ఫీలయ్యాడు..? తన స్లిమ్ లుక్ కోసం చిరు ఏం చేశాడు..? ఈ విశేషాలన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు మెగాస్టార్. చిరు-150కి సంబంధించిన ఆ సంగతులేంటో ఆయన మాటల్లోనే చిరు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘తొలి రోజు షూటింగ్ అనుభవం చాలా బాగా అనిపించింది. ఐతే షూటింగుకి మూడు రోజుల ముందే మేకప్.. కాస్ట్యూమ్స్‌ తో టోటల్ గెటప్ వేసుకొని.. స్టిల్స్ తీసుకున్నాం. కెమేరాకు కొంతవరకు ఎక్స్‌ పోజయ్యా. ఆ స్టిల్స్ చూసుకుని అందరం సంతృప్తిం చెందాం. ఇన్నేళ్ల గ్యాప్ వచ్చిన సంగతే నాలో కనిపించలేదని.. 20 ఏళ్ల కిందటి వాడిలా ఉన్నానని వినాయక్ అన్నాడు. ఇదే సినిమాకు ఫస్ట్ సక్సెస్ అని కూడా చెప్పాడు. చాలా సంతోషించాను. నా రీఎంట్రీ మూవీ మీద ఉన్న అంచనాల దృష్ట్యా మంచి లుక్ లో కనిపించాలనుకున్నా. అందుకే కష్టపడి బరువు తగ్గా. రోజూ గంటన్నర సేపు జిమ్‌ చేస్తున్నా. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్త పడుతున్నా. ప్రత్యేకంగా ఒక డైటీషియన్ని కూడా పెట్టుకున్నా.

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పూర్తి స్థాయి సిన్మా చేస్తున్నాను. అందులోనూ ఇదో మ్యాజికల్ నంబర్‌ తో ముడిపడ్డ సినిమా. అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకునేలా ఉండాలనే సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. సరైన కథ ఎంచుకోవడానికి సమయం తీసుకున్నాం. ఎంతో శ్రమించాం. ఈ సినిమా ఎవరినీ అసంతృప్తికి గురి చేయదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో ఉన్నాం. ఈ సినిమాకు ఇంకా ఏ పేరూ అనుకోలేదు’’ అని చిరు చెప్పాడు. 150వ సినిమా తర్వాత కూడా తాను వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తానని చిరంజీవి అన్నాడు.
Tags:    

Similar News