మెగా మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్పీచ్ లో భాగంగా.. నిర్మాతగా వ్యవహరించిన తన కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. 'నేను రామ్ చరణ్ గురించి తప్పకుండా చెప్పాలి.. రామ్ చరణ్.. నేను ఊహించలేదు ఇంత సమర్ధనీయమైన నిర్మాతగా తను అవతారం ఎత్తుతాడని. నేను తిరిగి సినిమాలో చేయాలని నాకు మీ అందరి నుంచి ఆహ్వానం లభించినపుడు.. అభిమానుల దగ్గరి నుంచి అమితాబ్ బచ్చన్.. రజినీకాంత్ లు పలు సందర్భాల్లో పలు వేదికలో. చిరంజీవి హ్యాజ్ టు కమ్ బ్యాక్.. చిరంజీవి రావాలి.. 150 వ సినిమా చేయాలి అని అందరూ అన్నారు.'
' వారి కోరిక మేరకు.. ఈ రకంగా పరిస్థితులు అనుకూలంగా వచ్చిన ఈ సందర్భంలో.. ఈ సినిమా నేను చేస్తాను అన్నపుడు ఆ సినిమా నేనే చేయాలని చరణ్ అన్నపుడు నేను అన్నాను. మనకెంతో మంది నిర్మాతలు ఉన్నారు. వాళ్లు చేస్తారు కదా.. మనం చేయాలా అన్నాను' అని చెప్పిన చిరు.. చరణ్ నిర్మాతగా ఎంత సమర్ధనీయంగా వ్యవహరించాడో చెప్పడం ప్రారంభించారు.
'నేను ఎప్పుడూ కూడా నేను సినిమా నటన పరంగానే నా హద్దులు తెలుసు కానీ.. రామ్ చరణ్ కి నటనాపరమైన హద్దులతో పాటు.. నిర్మాణాత్మకమైన నిర్మాణానికి సంబంధించిన పద్దులు కూడా తెలుసు. అందుకనే ఈ సినిమా చాలా సమర్ధవంతంగా చేసి శభాష్ అనిపించాడు. నాకున్న అగ్ర నిర్మాతల్లో తను వారి సరసన నిలబడే సామర్ధ్యం ఉన్న నిర్మాత రామ్ చరణ్. తన టెక్నీషియన్స్ ను తను ఎంత బాగా చూసుకున్నాడో ఈ సందర్భంగా చెప్పాలి. తను ధృవ షూటింగ్ కి బ్యాంకాక్ లో ఉన్నపుడు.. మేము స్లొవేనియో.. క్రొయేషియా షూటింగ్ చేస్తున్న సమయంలో.. తను అక్కడ ఉన్నాసరే.. తన సాంగ్ లో తను పార్టిసిపేట్ చేస్తున్నా.. తన మనసంతా ఇక్కడే ఉంది.'
'ఇక్కడ ఉండే చిన్న చిన్న టెక్నీషియన్స్.. అంటే కాస్ట్యూమ్స్ అసిస్టెంట్స్ కానీ.. మేకప్ అసిస్టెంట్స్ కానీ.. ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కానీ.. కెమేరా అసిస్టెంట్స్ కానీ.. వీళ్లందరి చేతుల్లో డబ్బులుండవు. వాళ్లు ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటారు. అందుకే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కి ఫోన్ చేసి.. వాళ్లందరికీ 300 యూరోలు కనీసం ఉండేలాగా.. ఎవరు ఎంత అడిగితే అంత ఇవ్వండి అని వాళ్ల గురించ అన్నాడంటే.. అది అత్యత్భుతమైన గెస్చర్ ఫ్రం రామ్ చరణ్ తేజ్' అంటూ తన నిర్మాత చరణ్ ను పొగడ్తల్లో ముంచెత్తారు చిరు.
'తనకు తెలుసు.. ఒక నిర్మాత తనను ఎలా చూసుకుంటే తను బాగా సంతృప్తి చెందుతాడో తనకు తెలుసు. అదే సంతృప్తి ప్రతీ ఒక్కరూ పొందాలనే తపనతో రామ్ చరణ్ ఉండడం చూస్తే.. నిజంగా భవిష్యత్తులో మంచి నటుడితో పాటు.. మంచి నిర్మాతగా కూడా తను స్థిరపడతాడన్న నమ్మకం నాకుంది' అంటూ 'గాడ్ బ్లెస్ యూ నానా.. థ్యాంక్యూ ఆల్.. థాంక్యూ వెరీ మచ్' అని చరణ్ గురించి చెప్పడం ముగించారు చిరు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/