చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత వెండితెర మీద కనిపించిన సినిమా ‘బ్రూస్ లీ’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. చిరంజీవి క్యామియో రోల్ గురించి మినహాయిస్తే ఈ సినిమా గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోలేదు. విడుదల తర్వాత సినిమా గురించి యూనిట్ సభ్యులు పెద్దగా ప్రమోట్ చేసింది కూడా లేదు. చిరంజీవి కూడా ‘బ్రూస్ లీ’ గురించి కానీ.. తన పునరాగమనం గురించి కానీ.. ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. ఐతే తాను, తన కొడుకు కలిసి నటించిన సినిమాను ప్రమోట్ చేయకున్నా.. తన తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ గురించి మాత్రం మాట్లాడాడు మెగాస్టార్. ప్రత్యేకంగా ఓ షో వేయించుకుని మరీ ‘కంచె’ చూసిన మెగాస్టార్.. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ వరుణ్ గురించి, సినిమా గురించి మాట్లాడాడు.
‘కంచె’ అద్భుతమైన సినిమా అని.. ఆ సినిమా చూసి తాను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానని చెప్పాడు మెగాస్టార్. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి సినిమా తీసి మెప్పించడం మామూలు విషయం కాదని.. అందుకు క్రిష్ తో పాటు యూనిట్ సభ్యులందరినీ అభినందిస్తున్నానని చిరు అన్నాడు. కంచె సినిమాను ప్రయోగం అని తాను అననని.. అది విజయవంతమైన ప్రయోగం అని చిరు చెప్పాడు. ఓ ప్రేమకథను వార్ బ్యాక్ డ్రాప్ లో క్రిష్ గొప్పగా చెప్పాడని.. సినిమాలో డైలాగులు కూడా అద్భుతమని.. కులం గురించి పెట్టిన డైలాగ్ చాలా బాగుందని.. మొత్తంగా ఎంతో పెద్ద సందేశాన్ని చిన్న చిన్న మాటల ద్వారా గొప్పగా చెప్పారని చిరు అన్నాడు. వరుణ్ తేజ్ కు తాను తండ్రినని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని చిరు చెప్పాడు.