#MAAelection : మా ఎన్నికల్లో 'మీడియా తీరు'పై చిరంజీవి సెటైర్లు

Update: 2021-10-10 06:32 GMT
మా ఎన్నికల వేళ మెగాస్టార్ చిరంజీవి మీడియాపై సెటైర్లు వేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా అందరినీ గౌరవించే చిరు తొలిసారి మీడియా తీరును, వ్యహరిస్తున్న అతని సుతిమెత్తగానే కడిగేశారు. మీడియాపై చిరంజీవి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మీడియా ఓవర్ యాక్షన్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది.

'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, జెనీలియా సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

'ఓటు వేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  పరిస్థితులు ఎప్పుడూ ఓకేలా ఉండవన్నారు. అన్ని సార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నుకలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు.. భవిష్యత్ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు.  'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం సినీ హీరోల వ్యక్తిగత విషయం అని.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. కొందరు షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల ఓటు వేయలేకపోవచ్చని.. దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.

'మా' ఎన్నికల్లో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు అని అన్నారు.. మా ఎన్నికల వల్ల మీడియాకు చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికిందని సెటైర్లు వేశారు. జూబ్లీ హిల్స్ స్కూల్ కు వచ్చిన ఆయన మీడియా తీరుపై ఈ రకమైన కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.  ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుంటాయి. అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని చిరంజీవి కవర్ చేసే ప్రయత్నం చేశారు.
Tags:    

Similar News