చిరు.. వరుణ్.. ఒక కుర్చీ..

Update: 2018-02-17 05:28 GMT
మెగా కాంపౌండ్ నుండి చాలా మంది హీరోలని మనం చూస్తున్నాం. అందరూ వేరే వేరే జోనర్ లలో సినిమాలు చేస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం ప్రేమకథలతో హిట్లు కొట్టి లవర్ బాయ్ గా మారిపోయాడు. ఫిదా తర్వాత తొలి ప్రేమ లో రాశి ఖన్నా తో ఈ మెగా హీరో కెమిస్ట్రీ అదిరిపోయింది. సినిమా ప్రేక్షకులకే కాదు చిరంజీవి కి కూడా నచ్చేసింది అంట.

సినిమా కు తన బాబాయ్ టైటిల్ పెట్టి హైప్ బాగానే పెంచాడు వరుణ్. ప్రోమోషన్స్ కూడా హై రేంజ్ లో చేశారు మూవీ యూనిట్. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి ప్రేమ అనుకున్న దాని కంటే ఎక్కువ కాలెక్షన్స్ నమోదు చేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమా హిట్ వెనక వరుణ్ కష్టం ఎంత ఉందో మిగతా టీమ్ ది కూడా అంతే ఉంది. అందుకే మన మెగాస్టార్ చిత్ర బృందాన్ని మొత్తాన్ని ఇంటికి పిలిచి సత్కరించారు. అందరికి శాలువా లు కప్పారు. చివరకి వరుణ్ తేజ్ వంతు వచ్చింది. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఎప్పుడు అందర్నీ నవ్వించే చిరు అక్కడ కూడా ఒక నవ్వుల బాంబ్ పేల్చారు. "వీడికి శాలువా కప్పాలంటే నేను కుర్చీ వేసుకోవాలి" అనటంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు.

నిజానికి చిరు అన్నది కూడా వాస్తవమే కదా.. మన వరుణ్ ఎత్తు అక్షరాల 6.4 అడుగులు మరి. మెగా హీరోల్లోనే కాదు, తెలుగు హీరోలలోనే చాలా పొడుగైన హీరో ఇతను.
Tags:    

Similar News