సెలబ్రిటీలు బయటకు వస్తే చాలు వారితో ఫోటో దిగాలని.. వారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని తెగ హడావిడి చేస్తారు. కానీ వారి ఇంట్లో వారు మాత్రం ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా సరే లైట్ తీసుకుంటారు. ఇదే విషయాన్ని సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన శూన్యం నుండి శిఖరాగ్రం వరకు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఈవెంట్ లో భాగంగా సినీ జర్నలిస్ట్ లతో తనకున్న అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్థావించారు చిరు. ఈతరం వారికి పాత తరం నటుల గొప్పదనం తెలియాల్సి ఉందని అన్నారు. తన ఇంట్లోనే తనని పట్టించుకోవడం లేదని సరదాగా అన్నారు చిరంజీవి.
మా ఇంట్లో మనవరాళ్లు.. మనవలు.. చరణ్, తేజ్, వైష్ణవ్ ల సినిమాలు.. పాటలే వేయమంటారు తప్ప తన సినిమాల గురించి కానీ తన పాటల గురించి కానీ అసలు పట్టించుకోరు. ఎంతైనా తను నటుడినే కదా అందుకే తన మనసులో ఒక జెలసీ ఫీలింగ్ వస్తుందని అన్నారు చిరు. అందుకే వారందరినీ కూర్చోబెట్టి తన సినిమాల గురించి, తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. లాక్ డౌన్ టైం లో వాళ్లందరికీ తన సినిమాలు చూపించానని.. అప్పటి నుంచి భయ్యా ఇది నువ్వా అని..
వాళ్లంతా ఆశ్చర్యపోయారని అన్నారు చిరు. వయసు పెరిగినా సరే వాళ్లు తనని భయ్యా అంటుంటారని అన్నారు. అలా తన గురించి తానే ఇంట్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చిందని చిరు చెప్పారు. ఇక కొసమెరుపుగా వాళ్లందరికీ తను నటించిన గాడ్ ఫాదర్ బాగా నచ్చిందని.. అందుకే ఒక్కొక్కరు నాలుగుసార్లు చూశారని అన్నారు చిరంజీవి. అసలు విషయం చెప్పుకోవాలి అంటే చిరంజీవి లేకపోతే చరణ్, తేజ్, వైష్ణవ్ లు ఉంటారా చెప్పండి.
తన ఇంట్లో తనని ఇలా చూస్తున్నారు అని చిరు లాంటి పెద్ద స్టార్ చెప్పడం మాములు విషయం కాదు. ఇక్కడ చిరు అది ఎందుకు చెప్పారు అంటే సినీ జర్నలిస్టుల ద్వారా పాతతరం నటుల గురించి ఇప్పటి జెనరేషన్ పిల్లలకు తెలిసేలా చేయాలని ఆయన ఉద్దేశం. ఇక తెలుగు సినీ జర్నలిజం తమిళంతో పోల్చితే ఆరోగ్యవంతంగా ఉందని. నెగటివ్ వార్తలు..
గాసిప్పులు ఎక్కువగా రాయరని ఆ విషయంలో సినీ జర్న్లిస్టులకు హ్యాట్సాఫ్ అని అన్నారు చిరంజీవి. ఒకప్పుడు తమిళంలో కిస్ కిస్ అనే కాలం వచ్చేది.. అందులో హీరోయిన్స్ గురించి అన్ని గాసిప్పులు రాసేవారు అది చదివి హీరోయిన్స్ చాలా బాధపడే వారని అన్నారు చిరు. తెలుగులో అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడో చిన్న చిన్న జరుగుతాయి.. వాటిని పెద్దగా పట్టించుకోరంటూ తెలుగు సినీ జర్నలిజం మీద తన అభిప్రాయాన్ని చెప్పారు చిరంజీవి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.