మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముళ్లు నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లు ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్న మాట జవదాటకుండా ఆయన వెంట నిలిచే తమ్ముళ్లు నాగబాబు మరియు పవన్ కళ్యాణ్. చిరంజీవి కూడా తన తమ్ముళ్లను తన కొడుకుల మాదిరిగా ఎంతో ఆప్యాయంగా చూసుకున్న వ్యక్తి చిరంజీవి. తాను కెరీర్ లో ఎదిగిన సమయంలో వారిని కూడా ఇండస్ట్రీలో పరిచయం చేసి వారి బాగోగులు చూసుకున్నాడు. అలాంటి చిరంజీవి ఒకానొక సమయంలో పెద్ద తమ్ముడు నాగబాబు పై చేయి చేసుకున్నాడట.
తాజాగా ఈ సంఘటన మెగా సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది. చిరంజీవి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాగబాబు 7వ తరగతి చదువుతున్నాడట. చిరంజీవి ఒక రోజు నాగబాబుకు లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురమ్మని చెప్పి మరేదో పనిమీద బయటకు వెళ్లాడట. పని ముగించుకుని వచ్చిన చిరంజీవికి నాగబాబు లాండ్రీకి వెళ్లలేదని తెలిసి బాగా కోపం వచ్చిందట. చెప్పిన పని చేయవా అంటూ చేయి చేసుకున్నాడట.
తమ్ముడిపై చేయి చేసుకోవడంపై అమ్మ కోప్పడిందని - అయితే నాన్న మాత్రం చిరంజీవిని సమర్దించాడట. చిరంజీవి కుటుంబ పెద్ద తరహాలో వ్యవహరించాడని నాన్న అభిప్రాయం. అందుకే నాన్న మద్దతు చిరంజీవికి దక్కింది. ఆ సమయంలో నాగబాబుపై చేయి చేసుకున్న చిరంజీవి ఆ తర్వాత చాలా బాధ పడ్డాడట. అప్పటి నుండి తమ్ముళ్లను మరింత ప్రేమగా చూసుకున్నాడట. నాగబాబును నటుడిగా.. నిర్మాతగా చేసింది చిరంజీవి అనే విషయం తెల్సిందే. తమ్ముళ్లకు ఒక తండ్రిలా మార్గదర్శకం చేసి వారి అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అన్నకు తమ్ముళ్లపై చేయి చేసుకునే హక్కు ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.