రాననుకున్నారా? రాలేననుకున్నారా? -చిరంజీవి

Update: 2017-01-07 15:23 GMT
''ఈ వీలలు చప్పట్లు విని చాలా సంవత్సరాలైంది. వీటికి ఎంత శక్తి ఉందనేది నాకు తెలుసు. ఇవన్నీ అనుభవించిన వాడిని. అయితే వీటికోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూసి.. ఇప్పుడు మీ ముందుకొచ్చాను. విజయవాడ కృష్ణా నది ప్రక్కన ఉన్నానా.. లేదా విశాఖ సముద్ర తీరాన ఉన్నానా అనేది నాకే అర్ధం కావట్లేదు. మీ కేకలూ కేరింతలూ తుఫాన్ సమయంలో సముద్రం చేసిన కేరింతలా ఉంది. మీరందరూ బాస్ కంబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది'' అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు చిరంజీవి.

దాసరి గురించి చెబుతూ..

''ఏదో ఒక పేపర్లో ఖైదీ 150గా చిరంజీవి అంటూ ఒక వ్యాసం రాగానే.. నా చొక్కా మీద ఉన్న 150 చూసి ఆ పత్రిక వారు అలా హెడ్డింగ్ పెడితే.. ''ఖైదీ నెం 150'' పెట్టండి అని దాసరి నారాయణరావు సూచించారు. అంత పెద్దాయన ఈ సినిమాకు ఆ పేరును సూచించారు కాబట్టి.. అదే పెడదాం అంటూ వినాయక్ కు చెప్పి.. ఆ పేరునే పెట్టాం. టైటిల్ సజెస్ట్ చేసినందుకు థ్యాంక్యూ సార్'' అని చెప్పారు.


ఇన్నేళ్ళ గ్యాప్ గురించి ప్రస్తావిస్తూ..

ఉర్దూ షాయరీలోని.. ఒక పొయెట్రీ సారాంశం చెబుతూ.. ''మన ఇద్దరం గడిపినటువంటి కాలం.. ఆ తరువాత వీడ్కోలు చెబుతూ విడిపోయావ్.. ఆ తరువాత మళ్ళీ వెల్కమ్ చేశాక మనం కలసిన కాలం.. ఆ తరువాత మనం ఇద్దరం దూరంగా ఉన్న కాలం నాకు గుర్తురావట్లేదు.. అంటూ ప్రియుడు చెబుతాడు. ఇప్పుడు నేను 2007లో శంకర్ దాదా జిందాబాద్ పేకప్ అయ్యాక.. తిరిగి 2017లో ఖైదీ నెం 150కు మేకప్ వేసుకున్న క్షణం వరకు.. మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు పది క్షణాల్లా గడిచిపోయాయ్ అన్నది వాస్తవం'' అన్నారు చిరంజీవి. ''ఇన్నేళ్ళూ లోపల నన్ను నడిపిన శక్తి.. నాకు ప్రేమాభిమానం చూపిస్తున్న శక్తి.. ఆ అభిమానం పేరు ఆ శక్తి పేరు.. నా తమ్ముళ్ళు నా సోదరులు.. వారు చూపించే ఆత్మీయత ప్రేమ అభిమానం'' అన్నారు.

150వ కథను ఎంచుకోవడానికి రీజన్..

''ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని కథలు వినడం జరిగాయ్. కొన్ని కథలు బాగున్నాయి కాని.. ఎక్కడో ఏదో లోపం అనిపించింది. విందు భోజనంలో ఉన్నా కూడా.. పూర్తి స్థాయి విందు భోజనంలా లేదు. అలాంటి సమయంలో కత్తి అనే సినిమాను.. మురుగుదాస్ తీసిన సినిమాను చూశాను. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది.. మనం కోరుకునే విందు.. వినోదం.. ఫైట్లు.. సెంటిమెంట్లు.. రైతుల కోసం తాపత్రాయపడే ఒక హీరో.. అందుకే ఈ సినిమా మనకు పర్ఫెక్ట్ 150వ సినిమా అవుతుందని అనిపించింది. నేను అనుకోగానే.. ఈ సినిమాను మీరు చేయండి నేను రైట్స్ ఇప్పిస్తానంటూ ముందుకొచ్చిన హీరో విజయ్ కు థ్యాంక్స్. అలాగే మురుగుదాస్ కు కూడా థ్యాంక్స్'' అని చెప్పారు.

దర్శకుడు వివి వినాయక్ గురించి మాట్లాడుతూ..

''నాకున్న తమ్ముళ్ళు నాగబాబు.. పవన్ కళ్యాణ్‌.. అయితే.. వారితో సమానంగా వారి సరసన ఉండే మరో తమ్ముడు ఆత్మీయుడు వినాయక్. అభిమానిగా నన్ను అర్దం చేసుకుని.. అద్భుతంగా తీశాడు వినాయక్. డ్యాన్సుల్లోనూ ఫైట్సులోనూ కామెడీలోనూ రొమాంటిక్ సీనుల్లోనూ ఎమోషనల్ సీనుల్లోనూ హార్ట్ టచ్చింగ్ సీన్స్ లోనూ.. సామాజిక బాధ్యతను తెలియజెప్పేలా.. మలిచాడు చెక్కాడూ వివి వినాయక్. నన్ను పువ్వుల్లో పెట్టుకున్నాడు చూసుకున్నాడు వినాయక్. చరణ్‌ ధృవ సినిమాలో బిజీగా ఉన్న సమయంలో నిర్మాత బాధ్యతలు కూడా తీసుకున్నాడు వినాయక్. వితిన్ టైమ్ వితిన్ బడ్జెట్ ఈ సినిమాను రూపొందించాడు వినాయక్. ఎన్నిసార్లు తనకు ధన్యవాదాలు చెప్పిన తక్కువే'' అని చెప్పారు చిరు.

వినాయక్ గురించి మరో మాట చెబుతూ ''మిమ్మల్ని చూస్తుంటే చూడాలనిఉంది.. గ్యాంగ్ లీడర్ చిరంజీవి గుర్తొస్తున్నాడు. ఆ మాటకే సినిమా సగం హిట్టయిపోయింది. నేను సినిమా చూస్తున్నప్పుడు.. నాకు అది కరక్టే అనిపించింది'' అన్నారు.

ఒక డైలాగ్ పండిస్తూ..

''రాననుకున్నాడా రాలేననుకున్నారా? డిల్లీకి పోయాడు డ్యాన్సులకు దూరం అయిపోయాడు.. హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరం అయిపోయాడు.. మధ్య కాలంలో మా మధ్యన లేడు మాస్ కు దూరం అయిపోయాడని అనుకుంటున్నారేమో.. అదే మాసూ.. అదే గ్రేసూ.. అదే హోరు.. అదే జోరు.. అదే హుషారూ..'' అంటూ 'ఇంద్ర' సినిమాలోని డైలాగ్ ను మార్చి చెప్పారు చిరంజీవి. ఈ డైలాగ్ తో ఇటు స్టేజీతోపాటు అటు యావత్ హాయ్ ల్యాండ్ గ్రౌండ్ హోరెత్తిపోయింది.

ఇతర టెక్నీషియన్ల గురించి చెబుతూ..

నన్ను మళ్లీ పాత చిరంజీవి గుర్తొచ్చేలా తీసిన మా క్యామెరామ్యాన్ రత్నవేలుకు కృతజ్ఞతలు. రామ్ చరణ్‌ కూడా ప్రొడక్షన్లో ఇరగదీశాడు. నాకున్న టాప్ నిర్మాతల సరసన చేరిపోతాడు. ఎవ్వరికీలేని రేర్ రికార్డ్.. రేర్ ఫీట్ చేసింది కాజల్. తండ్రితో చేసి కొడుకుతో చేసిన సందర్భాలు ఉన్నాయి.. కొడుకుతో చేసి తండ్రితో చేయడం అనేది రేర్ ఫీట్. కాజల్ గ్లామర్ తో స్ర్కీన్ అంతా కుమ్ముడే.

అలాగే అత్యధ్బుత మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ని అభినందిస్తూ.. ప్రతీ పాటనూ దాదాను ఒక లైన్ పాడేశారు చిరు. ''దేవిశ్రీ అద్భుత్మైన ట్యూన్లు ఇచ్చాడు. ఊపేశాడు. యుట్యూబ్ లో ఒక్కొక్క సాంగునూ యుట్యూబ్ లో లక్షల మంది చూస్తున్నారంటే.. ఎంత పెద్ద హిట్టయ్యిందో మళ్లీ చెప్పక్కర్లేదు. ఆ క్రెడిట్ అంతా మా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కే దక్కుతుంది"

ఇతర టెక్నీషియన్ల గురించి చెబుతూ.. ''ఈ సినిమాకు కోప్రొడ్యూసర్.. చరణ్‌కు మరో కజిన్ అయిన కొప్పినీడు విద్య.. అలాగే నేను స్టయిలిష్‌ గా కనిపించడానికి ఎంత కృషి చేసిన నా కుమార్తె సుస్మితలతకు కృతజ్ఞతలు'' అన్నారు.

మెగా హీరోస్ గురించి మాట్లాడుతూ..

మెగా హీరోలు.. వారందరీ ఫంక్షన్లకు నేను గెస్టుగా వెళ్ళి శుభాసిస్సులు నేను తెలియజేస్తుంటాను. ఇప్పుడు వారందరూ తమ బిజీ షెడ్యూల్స్ నుండి బ్రేక్ తీసుకుని.. అల్లు అర్జున్.. వరుణ్‌ తేజ్.. సాయిధరమ్ తేజ్.. శిరీష్‌.. మా అమ్మాయి నిహారిక.. నాకోసం వచ్చినందకు కృతజ్ఞతలు.

సినిమాలోని డైలాగుల గురించి చెబుతూ..

''కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీదు. కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీ నాది'' వంటి డైలాగులు రాసిన బుర్రా సాయిమాధవ్.. వేమారెడ్డిలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పకడ్భందీ గా స్ర్కీన్ ప్లే రాయడంలో నాకు సహాయపడిన అజ్ఞాత వ్యక్తి సత్యానంద్. ఆయనకు కూడా థ్యాంక్స్

చివరగా..

''జెమిని కిరణ్‌.. జికె మోహన్.. వారికి నా కృతజ్ఞతలు. వీరందరి గురించి చెప్పి ఒకరి గురించి చెప్పకపోతే సంపూర్ణత రాదు. అల్లు అరవింద్'' అన్నారు మెగాస్టార్. అలాగే ఎపి పోలీస్ కు.. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News