తమ బిడ్డల సినిమాల విషయంలో తండ్రుల ప్రమేయం ఎక్కడైనా సహజంగా ఉండేదే. అందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా మినహాయింపు కాదు. మొదట్లో కథ మొదలుకొని అన్ని విషయాలు తానే చూసుకున్న చిరు ఇప్పుడు చరణ్ కుదురుకున్నాక తన జోక్యం తగ్గించినట్టు టాక్. కానీ ప్రతి ప్రాజెక్ట్ డిస్కషన్లో తనకు తోచిన మేర సలహాలు - సూచనలను మాత్రం ఇస్తూ ఉంటారు. రచ్చ, నాయక్ సినిమాల విషయంలో చిరు దగ్గరుండి చేయించిన మార్పులు చాలా హెల్ప్ చేశాయని ఆ దర్శకులు కూడా చెబుతూ ఉంటారు. ఇక రంగస్థలం అయ్యాక రామ్ చరణ్ చేస్తున్న బోయపాటి శీను సినిమా కోసం కూడా చిరు కొంత ఏకాంత చర్చలు జరిపినట్టు సమాచారం. అందులో భాగంగా శీనుతో యాక్షన్ - కామెడీ ఎంతెంత డోస్ ఉంటే బాగుంటుందో వివరిస్తూ కావాల్సిన మార్పులు చేయమని సలహా ఇచ్చారట. అవి సబబుగానే ఉండటంతో బోయపాటి కూడా ఒప్పుకున్నట్టు టాక్.
బోయపాటి శీను లాస్ట్ మూవీ జయ జానకి నాయక నేపధ్యం ప్రేమ కథే అయినప్పటికీ మితి మీరిన హింస - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్ కి మించి హీరోయిజం ఎక్స్ ప్లాయిట్ చేయించే ప్రయత్నం చేయటం కొంతమేర దెబ్బ తీసింది. పైగా కామెడీ కూడా అంతంత మాత్రంగానే ఉండటం కూడా వర్క్ అవుట్ కాలేదు. సరైనోడులో సైతం యాక్షన్ ఉన్నంత భీభత్సంగా ఎంటర్టైన్మెంట్ ఉండదు. అందుకే ఈ విషయాలు దృష్టిలో ఉంచుకునే చిరు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నెల మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ లో చరణ్ పాల్గొంటాడు.
చిరు చెప్పాడని కాదు కాని యాక్షన్ - ఫ్యామిలీ డ్రామా ఎంత ఉన్నా దానికి సరిపడా కామెడీ కూడా అవసరమైనంత జోడిస్తే విజయావకాశాలు పెరుగుతాయి. ఇంద్ర, గ్యాంగ్ లీడర్ - ఘరానా మొగుడు - రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో భీభత్సమైన యాక్షన్ - సెంటిమెంట్ తో పాటు అంతే మోతాదులో కామెడీ కూడా ఉంటుంది.అందుకే అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. చరణ్ నాయక్ చూసినా బ్రహ్మానందం - జయప్రకాష్ రెడ్డి పాత్రల ద్వారా ఇదే ఫార్ములానే ఫాలో అయ్యారు. సో బోయపాటి శీను ఈ సారి అన్ని సమపాళ్ళలో సెట్ చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్.