అనూహ్యంగా ఊహించని విధంగా కోకాపేటలో వేసిన సైరా సెట్ అగ్ని ప్రమాదంలో బూడిద కావడం యూనిట్ మొత్తాన్ని నిరాశకు గురి చేసింది. అతి త్వరలో షూటింగ్ పూర్తవుతుందనుకుంటుండగా ఇలా జరగడం ఇప్పుడు రిలీజ్ డేట్ మీద ప్రభావం చూపేలా ఉందని ఇన్ సైడ్ టాక్. దసరాకు తెస్తామని నిర్మాత రామ్ చరణ్ గతంలో చెప్పినప్పుడు అందరూ ఇది సాధ్యమేనా అనుకున్నారు.
కాని సురేందర్ రెడ్డి షూట్ ని పరిగెత్తించడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మరోవైపు జరిగేలా ప్లానింగ్ చేసుకోవడంతో వచ్చే అవకశాలు పెరుగుతూ పోయాయి. ఇప్పుడీ ఫైర్ యాక్సిడెంట్ వల్ల బాలన్స్ ఉన్న కొద్ది పార్ట్ మళ్ళి సెట్ వేసి తీస్తారా లేక గ్రీన్ మ్యాట్ తో మేనేజ్ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాలి
అయితే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే దసరాకు రావడం అంత ఈజీగా మాత్రం లేదు. గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎంత లేదన్నా కనీసం ఆరు నెలలు కేటాయిస్తే తప్ప ఇలాంటి భారీ ప్రాజెక్ట్స్ లో క్వాలిటీ రాదు. హడావిడి పడితే జరిగే నష్టం మాములుగా ఉండదు. అందులోనూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
అసలు బిజినెస్ వ్యవహారాలు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుపెట్టనే లేదనే టాక్ బలంగా ఉంది. చేతిలో ఉన్న ఐదు నెలల కాలంలో ఇవన్ని బాలన్స్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో దీనికి బజ్ తేవడం అంత ఈజీ కాదు. సో ఈ ఏడాది సైరాని మెగా ఫ్యాన్స్ చూడటం అనుమానంగానే ఉంది.