ఎక్స్ క్లూజివ్: సైరా సెకండ్ షెడ్యూల్ ఫిక్స్

Update: 2018-01-17 11:48 GMT
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా షూటింగ్ పై మరో అప్ డేట్ వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ జరుపుకున్న తర్వాత.. రీసెంట్ గా తొలి షెడ్యూల్ షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ పరిసరాల్లో కొంత భాగం షూటింగ్ తో పాటు.. దాదాపు యూనిట్ అందరికీ లుక్ టెస్టులను కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిపై రకరకాల రూమర్స్ వచ్చాయి.

ఈ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు నయనతార డేట్స్ అందుబాటులో లేవని.. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తీరు మెగాస్టార్ కు నచ్చలేదని.. అనుకున్న స్థాయిలో రషెస్ రాలేదని.. దర్శకుడిని మార్చే యోచన చేస్తున్నారని.. ఇలా అనేక రూమర్స్ వచ్చాయి. ఇప్పుడివన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. సైరా చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభానికి సర్వం సిద్ధమైపోతోంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ రెండో షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. హైద్రాబాద్ స్టూడియోస్ లో వేసిన కొన్ని సెట్స్ తో పాటు.. తమిళనాడులో పొలాచ్చిలో కూడా షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ తో పాటు.. నయనతారపై సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆమె నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

మెగాస్టార్ ఈ షెడ్యూల్ కోసం తన లుక్ ను కూడా ఛేంజ్ చేసుకున్నారు. దాదాపుగా తొలిగించేసిన మీసాల లుక్ తో చిరు కనిపిస్తున్నారు. సైరా చిత్రాన్ని 2019 ప్రారంభంలో విడుదల చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి.. నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించారు.
Tags:    

Similar News