మెగా రీ ఎంట్రీ విషయంలో అభిమానుల్లో ఎంత కోలాహలం నెలకొందో చూస్తూనే ఉన్నాం. అయితే చిరు తన 150వ సినిమాకి ముందుగానే రామ్ చరణ్ సినిమాలో నటించాలని డిసైడ్ అయ్యాడు. అప్పట్నుంచి రామ్ చరణ్ `బ్రూస్ లీ`కి మరింత హైప్ వచ్చేసింది. అభిమానులు కూడా హ్యాపీగానే ఫీలయ్యారు. 150వ సినిమావరకు కాకుండా చిరుని తొందర్లోనే చూస్తాం కదా అని మరింత ఖుషీ అయిపోయారు. తండ్రీ కొడుకులు కలిసి కనిపిస్తారని తెలిసి ఎవరి స్టైల్ లో వాళ్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ఓ పాటలో ఆడిపాడతారని ప్రచారం సాగడంతో తెలుగు ఖజరారే పాట వస్తుందని ఊహించారంతా. బంటీ ఔర్ బబ్లీలో ఖజరారే ఖజరారే... అంటూ అమితాబ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ కలిసి ఎలా సందడి చేశారో అలా చెర్రీ - చిరు అదరగొట్టేస్తారని, ఆ పాటలాగే ఇది కూడా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని మెగా అభిమానులు మాట్లాడుకొన్నారు. చిత్రబృందం కూడా అవుననే అన్నట్టుగానే సంకేతాలిచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చిరుకోసం పాట తయారు చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు.
కానీ ఒక్కసారిగా నిన్న యూనిట్ నుంచీ, రామ్ చరణ్ నుంచి `మెగాస్టార్ కనిపించేది యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రమే` అన్న ప్రకటన వెలువడింది. దీంతో మెగాభిమానులు అవునా? అంటూ అవాక్కయ్యారు. చిరు డ్యాన్సులంటే పడిచస్తారు అభిమానులు. కానీ ఆ మెగా మేజిక్ డ్యాన్సుల్ని ఇప్పట్లో చూడలేమన్నమాట అంటూ డీలా పడిపోతున్నారు. కానీ చిరు ఫైట్లు చేసినా అదిరిపోయేలా ఉంటాయి కాబట్టి ఆ ఫైట్ అన్నా చూద్దామని రెడీ అయిపోయారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఆ పైట్ కంపోజ్ చేస్తున్నారు. ఆ ఫైట్ కోసం తమన్ ప్రత్యేకమైన మ్యూజిక్ ఇస్తున్నాడని తెలిసింది. అయితే తెలుగు ఖజరారే పాట చూడాలంటే మాత్రం మరింత సమయం పట్టేలా ఉంది. మళ్లీ `బ్రూస్‌లీ` తర్వాత చిరు - చరణ్ ఎప్పుడు కలిసి నటిస్తే అప్పుడు ఆ పాటని ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.