ఆయన స్థానంలోకి చిరు చేరుతున్నారా?

Update: 2017-11-04 05:48 GMT
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు ఎంతటి పెద్ద దిక్కు అనే సంగతి చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాలకు అండగా.. ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ కు కష్టం వచ్చినా.. అండగా నిలిచేలా ఆయన మరణం.. టాలీవుడ్ కు తీరని లోటు అని చెప్పాల్సిన పని లేదు.

దాసరి తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతూనే ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి మెల్లగా ఆయన ప్లేస్ లోకి వస్తున్నారని అనిపించక మానదు. చిన్న సినిమాలకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ వారు ఆయనతో ఏదో ఒక లాంఛింగ్ ల ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలని చూడడం గమనిస్తూనే ఉన్నాం. రీసెంట్ గా రాజశేఖర్-జీవితలు కూడా తమ విబేధాలను పక్కన పెట్టి మరీ.. చిరంజీవిని కలిసి తమ సినిమా పీఎస్వీ గరుడవేగ ప్రమోషన్ చేయించుకున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా సినిమా విజయాన్ని కోరుకున్నారు.

ప్రస్తుతం లాంఛింగ్ లు.. బ్లెసింగ్స్ వరకే కథ నడుస్తున్నా.. ఇండస్ట్రీ పరిస్థితులు గమనిస్తుంటే.. దాసరి ప్లేస్ ని రీప్లేస్ చేసే సామర్ధ్యం ఉన్న మంచి మనిషి కోసం పడుతున్న ఆరాటం కనిపిస్తుంది. వ్యక్తిగా చిరుకు ఉన్న మంచి పేరు.. మెల్లగా ఆయనను ఒక్కో మెట్టు పైకెక్కిస్తోంది. ఇండస్ట్రీలో పలు విభాగాల కష్టాల గురించి ప్రశ్నించేవరకూ చిరంజీవి వస్తే మాత్రం.. దాసరి ప్లేస్ లోకి చిరును తీసుకొచ్చేసినట్లే చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News