ఉయ్యాలవాడ బౌండ్ స్క్రిప్ట్.. ఒట్టి మాటలేనా?

Update: 2017-04-10 08:06 GMT
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. మెగా 151 ఇదేనని ఇప్పటికే మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి దేశభక్తి చిత్రంలో.. స్వాతంత్ర్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించడం ఖాయమనేది టాక్. ఇప్పుడు కాదు.. అసలు ఉయ్యాలవాడగా చిరంజీవి అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తోంది.

పరుచూరి బ్రదర్స్ ఈ కథను చిరంజీవికి వినిపించామని గతంలోనే చెప్పారు కూడా. అప్పటి టాక్ ప్రకారం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందనే మాట వినిపించింది. కానీ అసలు వాస్తవం వేరేగా ఉందట. రెండున్నర గంటలపాటు నడిపించే కథా కమామీషు మాత్రం లేవట. మొత్తం లభించిన సమాచారం ప్రకారం ఓ గంటకు పైగా మెటీరియల్ మాత్రమే ఉందని తెలుస్తోంది. ఏ చిత్రానికి అయినా కనీసం 2 గంటలు నడిపించే సరుకైనా కావాల్సిందే. అంతవరకూ ఉంటే.. మిగతాది పాటలు.. ఫైట్స్ తో నడిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఉయ్యాలవాడ విషయంలో అసలు చరిత్రే దొరకడం లేదని చెప్పుకుంటున్నారు.

అందుకే ఇంకా సినిమా గురించిన అనౌన్స్ మెంట్ రాలేదట. కొన్ని యుద్ధాలకు సంబంధించిన శిలా ఫలకాలు మాత్రమే లభించడంతో.. మిగతాదంతా కల్పించి చిత్రాన్ని తీసినట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఉయ్యాలవాడకు కలగకుండా ఉండాలని అనుకుంటున్నారట. ఆ పనిలోనే సురేందర్ రెడ్డి.. పరుచూరి బ్రదర్స్ తెగ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News