మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ సి 12 పేరుతో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. బోయపాటి & దానయ్య టీమ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అజర్ భైజాన్(యూరప్)లోని అరుదైన లొకేషన్లలో చరణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఆన్ లొకేషన్ నుంచి చరణ్ ఫోటోలు - వీడియోల్ని ఉపాసన అభిమానులకు షేర్ చేశారు.
అదంతా సరే.. చరణ్ కి ఆన్ లొకేషన్ ఊహించని ఓ సర్‌ప్రైజ్. అది కూడా మెగాస్టార్ చిరంజీవి రూపంలో. అక్కడ లొకేషన్ లో సడెన్ గా మెగాస్టార్ ప్రత్యక్షమై చెర్రీ& టీమ్ కి సర్ ప్రైజ్ ని ఇచ్చారు. ఎక్కడో జార్జియాలో సైరా షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ & టీమ్ పై భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు తన షూటింగ్ కోసం ప్రిపేరవుతూనే మెగాస్టార్ ఇలా సర్ ప్రైజ్ ఇవ్వడం చూస్తుంటే కొడుకు కోసం చిరు ఎంతగా తపిస్తారో అర్థమవుతోంది. అజర్ భైజాన్ వెళ్లిన చిరంజీవి ..రోజంతా ఆన్ లొకేషన్ లోనే గడిపారట. మరో రెండ్రోజులు పాటు చరణ్ తోనే ఉండేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీంతో కొడుకంటే ఎంత శ్రద్ధనో అంటూ యూనిట్ లోనూ ముచ్చట సాగింది.
చరణ్ వినే కథలు సహా మేకింగ్ విషయంలోనూ చిరు కచ్ఛితంగా ఇన్వాల్వ్ అవుతారు. తన అనుభవాన్ని రంగరించి సరైన సూచనలు - సలహాలు ఇస్తుంటారు. చెర్రీ కెరీర్ ని అంత పెద్ద కాన్వాసులో తీర్చిదిద్దడంలో చిరు ఐడియాలు పెద్దగానే వర్కవుటయ్యాయనడంలో సందేహం లేదు. ఇక అజర్ భైజాన్ నుంచి నేరుగా జార్జియాలో సైరా సెట్స్ కి చిరు వెళతారని తెలుస్తోంది. అక్కడ పాతిక రోజుల షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో భారీ వార్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించనున్నారు.