గత దశాబ్ద కాలంలో ఎన్నో బాక్సాఫీస్ సమరాల్ని చూశాం. కానీ ఈ సంక్రాంతి సమరానికి ముందు వచ్చినంత హైప్ అప్పుడెప్పడూ కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ పోరుకు ఉన్న ప్రత్యేకత అది. వీళ్లిద్దరూ గతంలో ఏకంగా 14 సార్లు బాక్సాఫీస్ ఫైట్ చేయడం విశేషం. మొత్తంగా ఎవరిది పైచేయి అన్నది లెక్క కట్టి చెప్పడం కష్టం కానీ.. చివరగా వీళ్లిద్దరూ తలపడినపుడు ఏం జరిగిందో చూద్దాం.
చిరు-బాలయ్య చివరగా 2004లో సంక్రాంతికి ఢీ అంటే ఢీ అన్నారు. అప్పుడు చిరంజీవి సినిమా ‘అంజి’ విడుదలైంది. బాలయ్య ‘లక్ష్మీ నరసింహా’తో వచ్చాడు. ఏళ్లకు ఏళ్లు వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు 2004లో విడుదలైన ‘అంజి’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. శ్యాంప్రసాద్ రెడ్డి ఈ చిత్రంపై భారీగా ఖర్చు పెట్టేయడం వల్ల ఇది ఫ్లాప్ గానే నిలిచింది. ఇక బాలయ్య సినిమా ‘లక్ష్మీ నరసింహా’కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. 50 డేస్ సెంటర్ల విషయంలో రికార్డు నెలకొల్పింది. కానీ ఈ సినిమాకు లాంగ్ రన్ లేకపోయింది. ఐతే చిరు మీద బాలయ్యదే పైచేయి అయింది.
దీని కంటే ముందు 2001లో చిరు-బాలయ్య తలపడ్డపుడు నందమూరి హీరోదే పూర్తి పైచేయి. చిరు సినిమా ‘మృగరాజు’ డిజాస్టర్ కాగా.. బాలయ్య చిత్రం ‘నరసింహనాయుడు’ తిరుగులేని విజయం సాధించింది. మరి 13 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150తో.. బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు. మరి ఈసారి ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/