మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ సినిమాకు కొరియర్ గా వచ్చిన ఈ సినిమా మొదట పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడినీ మాత్రం వెనక్కి తేలేకపోయింది. అంతకుముందు బాక్సాఫీస్ వద్ద ఆచార్య సినిమా తీవ్ర స్థాయిలో నష్టాలను కలుగజేయగా ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా చివరకు నష్టాలను కలిగించింది.
ఇక 2023 సంక్రాంతికి వాల్తేరు అయ్యే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు బాబి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ వర్గం ప్రేక్షకుల్లో గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది.
అయితే ఇప్పుడు సినిమా బిజినెస్ కూడా మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చివరి మూడు సినిమాలు కూడా మెగాస్టార్ డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రస్థాయిలో నష్టాలను కలిగించాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఖైదీ నెంబర్ 150 తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా నష్టాలను కలిగించింది. ఆచార్య సినిమా అక్కడ తొమ్మిది కోట్లకు అమ్ముడవ్వగా సగానికి పైగా నష్టాలను కలిగించింది.
ఇక సైరా సినిమా మాత్రమే పెట్టిన పెట్టుబడిని కాస్త వెనక్కి తెచ్చింది. సైరా సినిమా ఓవర్సీస్ లో 10 కోట్లకు ఆముద్దయ్యింది. ఇక గాడ్ ఫాదర్ సినిమా ఓవర్సీస్ లో 7.5 కోట్లకు అమ్ముడవ్వగా 6 కోట్లను మాత్రమే వెనక్కి తెచ్చింది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా 7.5 కోట్లకు అమ్ముడు అయినట్లు సమాచారం. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్యను విడుదల చేయబోతోంది. మరి చివరి మూడు సినిమాలతో కూడా మెగాస్టార్ చిరంజీవి నష్టాలను కలిగించాడు. మరి ఈసారైనా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందిస్తాడో లేదో చూడాలి.