నిజమైన పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినపుడు కాదు.. ప్రయోజకుడైనపుడు అన్న సామెత తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. ఆయన సతీమణి సురేఖ ఇలాంటి ఆనందంలోనే ఉన్నార. ‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్లు చరణ్ ను చూసి గర్విస్తున్నారట. కొన్ని రోజుల కిందటే ఇంట్లో ప్రత్యేకంగా షో వేయించుకుని ‘రంగస్థలం’ చూసిన చిరంజీవి.. ఈ సినిమాకు స్పెల్ బౌండ్ అయిపోయానని.. నటుడిగా చరణ్ కు ఇది ఒక మైలురాయి లాంటి మూవీ అని కితాబిచ్చేశాడు. ఒక ఆర్టిస్టుగా చరణ్ ను చూస్తే ఈర్ష్యగా ఉందని.. కానీ ఒక తండ్రిగా గర్విస్తున్నానని చిరు చెప్పడం విశేషం.
‘రంగస్థలం’ సినిమా ప్రదర్శన పూర్తయ్యే సమయానికి చరణ్ బయటి ఎండలో తిరిగి ఇంటికి వచ్చాడని.. ఆ సమయంలో సురేఖ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయిందని చిరు చెప్పాడు. అప్పటికే బాగా ఎమోషనల్ అయిపోయిన సురేఖ క్లైమాక్స్ సీన్లలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయిందని.. కొడుకును పట్టుకుని బోరున ఏడ్చేసిందని చిరు చెప్పాడు. నిజానికి తాను కూడా ఎమోషనల్ అయినప్పటికీ ఆ ఉద్వేగాన్ని బయటికి చూపించలేదని చిరు చెప్పాడు. తనకు ‘ఖైదీ’ లాగా ‘రంగస్థలం’ చరణ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా అవుతుందని చిరు చెప్పాడు. ఈ సినిమాకు అనేక అవార్డులు కూడా వస్తాయని.. జాతీయ అవార్డుల్లో దీనికి చోటు లేకపోతే అన్యాయం చేసినట్లే అవుతుందని చిరు అనడం విశేషం.