మొదటి మెసేజ్ చిరు నుంచే...

Update: 2016-12-14 03:39 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెట్టేస్తోంది. టాలీవుడ్ ఇంతకు ముందు చూడని థీమ్ ను.. రీమేక్ అయినా సరే తన స్టైల్ లోకి మార్చుకుని.. స్టైలిష్ డైరెక్టర్ గా తనకున్న పేరును నిలబెట్టుకుంటూ.. విజయం సాధించాడు సురేందర్ రెడ్డి. ధృవ సక్సెస్ లో మెజారిటీ పార్ట్ రచయిత మోహన్ రాజా అని ధృవ టీం చెబుతున్నా.. ఒరిజినల్ తని ఒరువన్ కంటే బెటర్ గా రీమేక్ ని తీర్చిదిద్దిన సురేందర్ రెడ్డి కష్టాన్ని ఏ మాత్రం తక్కువ చేయడానికి లేదు. టెక్నికల్ గా తని ఒరువన్ కంటే బెటర్ మూవీ ధృవ అని అందరూ ప్రశంసిస్తుంటే తెగ ఇబ్బంది పడిపోతున్నాడట సూరి.

మరి ఇంతటి సక్సెస్ సాధించిన తర్వాత.. మొదటి అభినందన ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి నుంచే. 'ఇదే అన్నిటికంటే బెస్ట్. నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది' అంటూ మెసేజ్ చేశారట చిరు. ఇదొక్కటి చాలు.. నేను ఇంకేం కోరుకుంటాను అంటున్నాడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసుకున్నాక ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయనన్నది సూరి వెర్షన్.

జనాలు డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారని చెప్పేందుకు ధృవ సాధించిన విజయం చక్కని ఉదాహరణ అంటున్న సురేందర్ రెడ్డికి.. గీతా ఆర్ట్స్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఆఫర్ సూరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News