మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో 'సైరా నరసింహారెడ్డి' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఇందులో మెగాస్టార్.. నక్సలైట్ పాత్రను పోషిస్తున్నారని ఇటీవల లీకైన ఫొటోను బట్టి తెలుస్తోంది. కొరటాల తన ప్రతి చిత్రానికీ ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే చిరంజీవితో చేస్తున్న సినిమా కూడా సందేశాత్మకంగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈసారి దేవాదాయ భూముల ఆక్రమణలపై ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోకి సరిసమానమైన మరో పాత్ర ఉండబోతోందని మొదటి నుండి అనుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య మెగాస్టార్ ఆ కీ రోల్ చరణ్ నటించే ఛాన్సెస్ ఉన్నాయని క్లారిటీ కూడా ఇచ్చేసాడు. అయితే ఈ మూవీలో చిరంజీవి కంటే బలమైన.. అత్యంత ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడట. అతడు చూపిన బాటలోనే నడిచే పాత్ర చిరుది అని సమాచారం. పాత్ర తక్కువ సేపు ఉన్నా ప్రాధాన్యం ఉంటుందని టాక్. తాజా సమాచారం ప్రకారం చిరుకు దిశానిర్దేశం చేసే పాత్రలో చెర్రీ కనిపిస్తాడట. అందుకే ఈ సినిమాకు గురువు అర్థం వచ్చేలా 'ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా, కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. తండ్రీకొడుకులు నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి మరి.