ఆ విషయంలో చరణ్ కు చిరు సీరియస్ క్లాస్

Update: 2019-02-14 05:47 GMT
చరణ్‌ కెరీర్‌ ఆరంభం నుండి కూడా ప్రతి సినిమా విషయంలో చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా వచ్చిన వినయ విధేయ రామ విషయంలో మాత్రం చిరంజీవి కల్పించుకోలేదని, సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉండటం వల్ల బోయపాటిపై నమ్మకంతో సినిమా పూర్తి అయ్యే వరకు ఎలాంటి టచ్‌ చేయలేదని సినీ వర్గాల్లో టాక్‌ నడిచింది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్‌, డిస్ట్రిబ్యూటర్ల నష్టాల నేపథ్యంలో చరణ్‌ వారి నష్టాలను భరించేందుకు తన పారితోషికంలో కొంత మొత్తంను వెనక్కు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.

అంతకు ముందు 'వినయ విధేయ రామ' చిత్రం ఫ్లాప్‌ నేపథ్యంలో ఫ్యాన్స్‌ కు బహిరంగ లేఖ రాశాడు. అందులో దానయ్యను వెనకేసుకు వచ్చాడు. సినిమా ఫ్లాప్‌ అయిన తర్వాత ఫ్లాప్‌ కు బాధ్యత వహిస్తూ లేఖలు రాయడం, పారితోషికం వెనక్కు ఇవ్వడం వంటి చర్యలు చిరంజీవికి కోపం తెప్పించాయట. ఇలాంటి పనులు చేయడం ఏంటీ అంటూ ప్రశ్నించాడట. వినయ విధేయ రామ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ నే రాబట్టింది. దాంతో బయ్యర్లు మరీ భారీ నషాలను అయితే మూట కట్టుకోలేదు. బయ్యర్లు నష్టపరిహారం డిమాండ్‌ చేయకుండానే చరణ్‌ పారితోషికం వెనక్కు ఇవ్వడంపై చిరంజీవి ఒకింత సీరియస్‌ అయినట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే ఫ్లాప్‌ వచ్చిన ప్రతి సారి కూడా నిర్మాతలు మరియు బయ్యర్లు హీరోల వైపు చూస్తారని, ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్లీ మళ్లీ ఆశిస్తారంటూ చిరంజీవి సున్నింతంగా చరణ్‌ కు క్లాప్‌ పీకాడట. ఈ విషయాల గురించి మొదట తనతో చర్చించక పోవడంపై కూడా చరణ్‌ తీరుతో చిరంజీవి అసహనంగా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అయితే మెగా ఫ్యాన్స్‌ మాత్రం చిరంజీవికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం చరణ్‌ తీసుకోడని, అసలు చిరంజీవి చెప్పడం వల్లే అలా చేసి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News