కరోనా విపత్తు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమకు చెందిన రోజు వారి వేతనం తీసుకునే కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారు తినడానికి కనీసం తిండి లేక అవస్థలు పడుతున్నారు. వారి కోసం టాలీవుడ్ స్టార్ కరోనా క్రైసిస్ ఛారిటీని చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పలువురు స్టార్ హీరోలు దర్శకులు నిర్మాణ సంస్థలు ఇప్పటికే ఈ ఛారిటీకి విరాళాలను అందించడం జరిగింది. కాని ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరు కూడా ఈ ఛారిటీకి విరాళాలు ఇవ్వక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం బ్రహ్మాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ కు సామాజిక బాధ్యత లేదా. టాలీవుడ్ సినీ కార్మికుల వెతలు వారికి పట్టవా అంటూ ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరు కూడా ఈసమయంలో ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. టాలీవుడ్ హీరోయిన్స్ లో కేవలం లావణ్య త్రిపాఠి మాత్రమే ఇప్పటి వరకు విరాళం ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మిగిలిన వారి నుండి విరాళాలను అడిగేందుకు స్వయంగా చిరంజీవి వారికి కాల్ చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రెండు మూడు రోజుల్లో ప్రస్తుతం టాలీవుడ్ లో లీడ్ లో ఉండి నిర్మాతల నుండి కోటికి పైగా పారితోషికంను అందుకున్న హీరోయిన్స్ జాబితాను తయారు చేసి స్వయంగా చిరంజీవి వారితో మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వివరించి వారిని విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ పని చిరంజీవి చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది కొందరి వాదన. మెగాస్టార్ స్థాయికి తగిన పని కాదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ కార్మికుల కోసం మెగాస్టార్ నిజంగా ఆ పని చేస్తే అభినందనీయుడే అంటూ మెగా ఫ్యాన్స్ కొందరు అంటున్నారు.