తెరమీద మెగాస్టార్ గా చిరంజీవి ఎంత పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించినా వ్యక్తిగతంగా ఆయనెంత సౌమ్యుడో అందరికి తెలిసిందే. ముఖ్యంగా మిత్రులు మిక్కిలిగా ఉన్న చిరుకు ప్రతి ఒక్కరు బంధువే . ఆ మధ్య బాలకృష్ణ నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ చిరంజీవే అని కుండబద్దలు కొట్టడం ఎవరూ మర్చిపోలేదు. తాజాగా మరో ఆప్త మిత్రుడిని పరామర్శించిన చిరు తాను స్నేహానికి ఇచ్చే విలువను మరోసారి చాటారు.
ఇటీవలే గత కొద్ది రోజులుగా సీనియర్ నటులు నిర్మాత మాజీ ఎంపి మురళీమోహన్ అస్వస్థతకు గురయ్యారు. దాని కారణంగానే ఎన్నికల ప్రచారంలోనూ ఆయన యాక్టివ్ గా బయట కనిపించలేదు. మీడియాకు అందుబాటులో ఉండాల్సిన తరుణంలోనూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయి కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు
అందుకే తానే స్వయంగా వెళ్లి కలిసి పుష్పగుచ్చం అందించి మురళీమోహన్ త్వరగా కోలుకోవాలని ఆశించారు చిరంజీవి. సతీసమేతంగా వెళ్ళడం గమనార్హం. ఈ ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో కలిసి నటించారు. ముఖ్యంగా చిరు పెద్దన్నయ్యగా గ్యాంగ్ లీడర్ లో మురళీమోహన్ నటన అంత సులువుగా మర్చిపోయేది కాదు. టిడిపిలో చేరాక ఎంత బిజీగా ఉన్నా ఈ ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ ఉండేవి.
ఈ మెగా ఓదార్పుకు సంతోషించిన మురళిమోహన్ ఈ సందర్భంగా తన స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపారు. కాసేపు ముచ్చట్లు చెప్పుకుని ఆ తర్వాత సెలవు తీసుకున్నారు. సైరా షూటింగ్ చివరి దశలో బిజీగా ఉన్నప్పటికీ చిరు ఇలా వీలు కుదిరినప్పుడంతా మిత్రుల పట్ల తన బాద్యతను నేరవేరుస్తునే ఉన్నారు.