ఈ సంక్రాంతి రెండు భారీ సినిమాలు.. మరో భారీ డబ్బింగ్ సినిమాతోపాటు బరిలో దిగుతోంది రంగులరాట్నం మూవీ. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో పరిమిత బడ్జెట్ తో అన్నపూర్ణ స్టూడియో ఈ సినిమా నిర్మించింది. అన్నపూర్ణ స్టూడియో లాంటి పెద్ద బ్యానర్ నిర్మించిన సినిమా కావడం.. ట్రయిలర్ కూడా కాస్తంత ఇంట్రస్టింగ్ అనిపించడం... హీరోయిన్ గా నటించిన చిత్ర శుక్లా ఫ్రెష్ లుక్ తో కనిపించడం వంటి వాటితో రంగులరాట్నం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన చిత్ర శుక్లా పేరు ఆడియన్స్ కు అంతగా పరిచయం చేయకపోయినా ఆమె అటు ఇండస్ట్రీకి కానీ.. కెమెరాకు కానీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు తెలుగులో మా అబ్బాయి అనే మూవీ లో బ్యూటీ నటించింది. సినిమాలో సంప్రదాయకంగా.. ఫొటో షూట్లలో హాటెస్ట్ గా కనిపిస్తూ కవ్విస్తున్న ఈ భామ కొన్ని బాలీవుడ్ డ్యాన్సుల్లో బాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా చేసింది. కొత్తందాలకు ఎప్పుడూ వెల్ కమ్ చెప్పే టాలీవుడ్ ఈ డ్యాన్సర్ ను హీరోయిన్ చేసింది. రంగులరాట్నం మూవీకి తనను ఆడిషన్ చేసి.. అన్నివిధాలా సరిపోయానని అనిపించాకే హీరోయిన్ గా తీసుకున్నారని చెబుతోంది చిత్ర శుక్లా. ఈ సినిమాలో నటించాకే లాంగ్వేజీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు చాలా విషయాల్లో డెవలప్ అయ్యానని అంటోందీ వయ్యారి.
రంగులరాట్నంలో చిత్ర శుక్లాది ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్. రియల్ లైఫ్ లోనూ తాను ఇలాగే ఉంటానంటోంది ఆమె. చదువుకునే రోజుల్లో ఎప్పుడూ తన తండ్రి నుంచి పాకెట్ మనీ అడిగి తీసుకోలేదని.. చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పి తనే సొంతంగా సంపాదించుకునే దాన్నని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సినిమాలోనూ అదే రేంజి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందని అంటోంది. రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ కూడా ఇలాగే డ్యాన్సర్ గా చేస్తూనే హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని ఫేమ్ లోకి వచ్చింది. తను కూడా అలాగే స్టార్ డమ్ తెచ్చుకుంటాననే ఆశతో ఉంది. నెరవేరుతుందేమో చూద్దాం.