'చిట్టి అడుగు' సాంగ్: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గా అఖిల్ ఎలా మారాడంటే..?
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని దసరా కానుకగా ఈ నెల 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి విడుదలైన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులోని 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' 'లెహరాయి' పాటలు శ్రోతలను ఆకట్టుకొని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా ''చిట్టి అడుగు'' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి.. ఇన్నాళ్లూ గాలిలోనే తెలియాడే చిట్టి అడుగా.. సర్లే ఇప్పుడైనా తెలిసిందిగా తొలిసారి.. ఇకనైనా నేల తాకినేర్చుకోవే కొత్త నడకా..' అంటూ సాగిన ఈ గీతం అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హర్ష పాత్ర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎలా పరివర్తన చెందింది అనే విషయాన్ని ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
'చిట్టి అడుగు' పాటకు మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ట్యూన్ సమకూర్చారు. దీనికి తగినట్లుగా ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. యువ గాయకుడు జియా ఉల్ హక్ ఈ పాటను ఆలపించారు. పూర్తిగా ఫారిన్ లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గా కూడా బాగుంది. అంతేకాదు అఖిల్ ఫస్ట్ లుక్ లో చెప్పులు లేకుండా ఉండటానికి కారణాన్ని కూడా ఇందులో చూపించారు.
గోపీ సుందర్ ఈ చిత్రంలోని అన్ని పాటలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారని చెప్పవచ్చు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రదీశ్ వర్మ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాని దర్శకుడు భాస్కర్ గత చిత్రాల తరహాలోనే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారని తెలుస్తోంది. ఇందులో ఆమని - ఈషా రెబ్బా - ఫారియా అబ్దుల్లా - చిన్మయి - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - అభయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Full View