చియాన్ టూమ‌చ్ ఫింగ‌రింగ్ ఈ క‌ష్టానికి కార‌ణం?

Update: 2019-11-22 09:24 GMT
చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు `ఆదిత్య వ‌ర్మ‌` చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `అర్జున్ రెడ్డి`కి రీమేక్ ఇది. ఈ సినిమా రిలీజ్ ముందు డైల‌మా.. అవాంత‌రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎట్ట‌కేల‌కు అన్నింటిని అధిగ‌మించి  త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సంద‌ర్భంగా ధృవ్ సినిమా విశేషాల‌తో పాటు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. త‌మిళ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో మార్పులు చేసామ‌ని.. నేను హీరోగా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డానికి ఈ క‌థ అయితే బాగుంటుంద‌ని నాన్న బ‌లంగా న‌మ్మి ఎంపిక చేసిన స్క్రిప్ట్  ఇది అని తెలిపాడు.

ఈసినిమా కోసం నాన్న రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించారు. సెట్ లో ఏ స‌న్నివేశంలో ఎలా న‌టించాలో చెప్పేవారు. నా ప‌నుల‌న్నింటిని ఆయనే ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఓస్టార్ త‌న‌యుడిగా సినిమాల్లోకి రావొచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. అందుకే  అన్ని విధాలా క‌ష్ట‌ప‌డ్డాను. నాలో న‌టుడ్ని ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నా. మీ మెప్పు పొందితే ఆ గొప్ప‌ద‌న‌మంతా నాన్న‌దే అవుతుంది. అలా జ‌ర‌గ‌లేదంటే ఆ త‌ప్పు నాదే అవుతుంది. నా వ‌య‌సుకు మించిన కొన్ని స‌న్నివేశాలు చేసాను. న‌టుడిగా అలాంటివ‌న్ని చేయాలి కాబ‌ట్టి త‌ప్ప‌లేదు. క‌థ‌లో ఏది చూపించాలో ..ఏది చూపించ‌కూడ‌దో నాన్నే డిసైడ్ చేసారు.

ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుంటాన‌న్న న‌మ్మ‌కం ఉంది.ఇక నాన్నకి నేను వీరాభిమానిని. ఆయ‌నే నా రోల్ మోడ‌ల్. అవ‌కాశం వ‌స్తే ఆయ‌న్ని నేను డైరెక్ట్ చేస్తా. ఆయ‌న కోసం ఓ క‌థ కూడా రాసిపెట్టుకున్నా. కానీ ఆ అవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌దు. నాన్న పిలిచే వ‌ర‌కూ వెయిట్ చేస్తాన‌ని తెలిపాడు. ఈ సినిమాకు అర్జున్ రెడ్డికి స‌హాయ ద‌ర్శ‌కుడిగా  ప‌నిచేసిన గీరిశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కానీ ధ్రువ్ మాట‌ల‌ను బ‌ట్టి చియాన్ ప్ర‌భావం సినిమాలో ఎక్కువ క‌నిపిస్తుంద‌నే అర్థ‌మవుతోంది.
Tags:    

Similar News