ది డార్క్ నైట్ - ఇంటర్ స్టెల్లార్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ భారతదేశ సినిమా పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారు. ఆయన ఇండియన్ సినిమాలను కూడా బాగానే చూస్తారు. ఇండియా సినిమాలో ఎమోషన్స్ చాలా బావుంటుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే ఈ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ముంబై లోఇండియాకు చెందిన ప్రముఖ తారాగణంతో ముచ్చటించనున్నాడు.
మార్చ్ 31న ముంబైలో "రీ ఫ్రెమింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది ఫిల్మ్" అనే విషయంపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇప్పటికే బాలీవుడ్ తారాగణం సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ - షారుక్ ఖాన్ అలాగే అమిర్ ఖాన్ - శ్యామ్ బెంగాల్ ఇంకా అనురాగ్ కశ్యప్ వంటి వారు సిద్ధమయ్యారు. అయితే కోలీవుడ్ నుంచి దర్శకుడు మణిరత్నం హీరో కమల్ హాసన్ కూడా ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రానున్నారు.
వారంతా కలిసి సినిమాలకు సంబందించిన ముఖ్యమైన విషయాలను గురించి చర్చించుకుంటూన్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ ఈవెంట్ లో పాల్గొనడం స్పెషల్ అని చెప్పాలి. సౌత్ తరపున డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కలవడానికి నటుల్లో ఆయన ఒక్కరే వెళుతున్నారు. ఇప్పటికే ఈవెంట్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.