డన్ కిర్క్.. ఇన్ సెప్షన్ లాంటి ఆస్కార్ సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలాన్ సుపరిచితం. నిర్మాత కం దర్శకరచయితగా అతడి ప్రతిభ అసమానం. డార్క్ నైట్ ట్రయాలజీ రైటర్ గా నోలాన్ పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. అయితే అలాంటి గ్రేట్ డైరెక్టర్ కం రైటర్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగా వేచి చూస్తారో చెప్పాల్సిన పనే లేదు.
క్రిస్టోఫర్ నోలన్ తాజా నిర్ణయంతో అభిమానులకు తీవ్ర నిరాశ తప్పడం లేదు. ది గ్రేట్ కల్ట్ ఫిల్మ్ మేకర్ నుంచి రానున్న థ్రిల్లర్ మూవీ `టెనెట్` రిలీజ్ ని వాయిదా వేయడమే అందుకు కారణం. జూలై 31 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ థ్రిల్లర్ ఆగస్టు 12కి వాయిదా పడింది. 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం ఫ్యాన్స్ ఎంతో వేచి చూస్తుండగా ఇలాంటి నిర్ణయం నిరాశపరిచింది.
కొవిడ్ -19 అమెరికా సహా పలు దేశాల్ని ఒణికిస్తోంది. యుఎస్ లో అంతకంతకు కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. ఆ కారణంగా థియేటర్లను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ `టెనెట్` విడుదలను ఆలస్యం చేయాలని వార్నర్ బ్రదర్స్ నిర్ణయించింది. ఆ మేరకు గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ గొలుసులు ..సింగిల్ స్క్రీన్లు మూసివేయడం వల్లనే ఈ నిర్ణయం అని ప్రకటించారు. రాబర్ట్ ప్యాటిన్సన్- డింపుల్ కపాడియా- మైఖేల్ కెయిన్- జాన్ డేవిడ్ వాషింగ్టన్ - ఎలిజబెత్ డెబికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.