పేరును చూసి అత్త.. మామ - పిన్ని... బాబాయ్ అంటూ తిరిగే ఫ్యామిలీ స్టోరీ అనుకొంటారు. కానీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాత్రం అంతకుమించిన హంగామా చాలానే చేసినట్టున్నాడు. చుట్టాలబ్బాయితో బోలెడంత యాక్షన్ చేయించాడు. ఫక్తు తెలుగు యాక్షన్ సినిమాలాగే సుమోలు - ఛేజింగ్ లు - కుదేసి ఎత్తి పడేయడాలన్నీ ఈ చిత్రంలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఆది కథానాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయి టీజర్ శనివారం విడుదలైంది. అందులో కామెడీ - యాక్షన్ ని బాగా చూపించారు. కథానాయకుడు ఆది రికవరీ బాబ్జీ పాత్రని పోషించాడు. పృథ్వీనేమో ఇగో రెడ్డిగా కనిపించబోతున్నాడు. అయితే ఏంటి నా మడత? అనే ఊతపదాన్ని పృథ్వీ ఉపయోగించినట్టు తెలుస్తోంది.
అయితే టీజర్ లో కామెడీ కంటే యాక్షనే హైలెట్ గా నిలిచింది. టీజర్ చూస్తే ఆదిలాంటి ఓ యువ కథానాయకుడితో అంత యాక్షన్ చేయించారా అని ఆశ్చర్యం కలుగకమానదు. గరమ్ తర్వాత ఆది నుంచి వస్తున్న చిత్రమిదే. ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ స్థాయి సినిమా చేయలేకపోయిన ఆది చుట్టాలబ్బాయితో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. దర్శకుడు వీరభద్రమ్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం. భాయ్ తర్వాత కోలుకోవడానికి, మరో అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి ఆయనకి ఇంత సమయం పట్టింది. చుట్టాలబ్బాయితో తప్పక హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయినట్టు చిత్రబృందం చెబుతోంది.
Full View