ఇండ‌స్ట్రీ త‌ర‌లింపులో 'మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్' పాత్ర‌!?

Update: 2020-06-14 09:35 GMT
మ‌ద్రాసు నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి త‌ర‌లి రావ‌డంలో ఎన్టీఆర్-ఏఎన్నార్-దాస‌రి స‌హా ఎంద‌రో దిగ్గ‌జాల కృషి ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఫిలింస్టూడియోలు స‌హా సినిమాకి అవ‌స‌ర‌మైన ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు. అదే క్ర‌మంలో మ‌ద్రాసు నుంచి న‌టీన‌టుల్ని పిలిపించుకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు వి.మ‌ధుసూధ‌న్ రావు హైద‌రాబాద్ లోనే న‌టీన‌టుల్ని త‌యారు చేయాల‌ని సంక‌ల్పించి మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్ ని ప్రారంభించారు. ఆయ‌న ఇనిస్టిట్యూట్ నుంచే ఎంద‌రో స్టార్లు త‌యారయ్యారు.

ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు.. మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్ అధినేత వి.మ‌ధుసూధ‌న‌రావు 93వ జ‌యంతి సంద‌ర్భంగా ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆయ‌న‌ను సంస్మ‌రించుకుని నాటి జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ-``మ‌ధుసూధ‌‌న‌రావు గారు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు నిర్మించారు.  ఏఎన్నార్ ఎన్టీఆర్ ల‌తో ప‌ని చేశారు. ఆయ‌న మామూలుగా ద‌ర్శ‌కుడిగానే కాదు మాన‌వ‌తావాదిగానూ పేరు తెచ్చుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న తెలుసు. ఫ్యామిలీ స్నేహం ఉంది. కానీ ఆయ‌న గురించి మ‌రెన్నో తెలిసాయి. ఆయ‌న ప్ర‌జ‌లు మాన‌వ‌త్వం గురించి ఆలోచించే మ‌నిషి. ఎన్నో సినిమాలు తీసి పెద్ద స‌క్సెస‌య్యారు. ప్ర‌జానాట్య‌మండ‌లిలో ప‌ని చేశారు. హైద‌రాబాద్ లో మ‌ధు ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంబించి ఎంద‌రో న‌టీనటుల్ని త‌యారు చేశారు. మ‌ధుసూద‌న్ గారికి పుట్టిన‌రోజు(జ‌యంతి) శుభాకాంక్ష‌లు`` అని అన్నారు.

మొద‌టిసారి హైద‌రాబాద్ ఏపీలో ఫిలింఇనిస్టిట్యూట్ ప్రారంభ‌మైంది. రామారావుగారు ఓపెన్ చేసిన తొలి ఫిలింఇనిస్టిట్యూట్. ఆ ఇనిస్టిట్యూష‌న్ లోనే నాన్న‌గారు ఫౌండ‌ర్ ప్రిన్సిప‌ల్ గా ప‌ని చేశారు. ఆ ఇనిస్టిట్యూట్ తో గొప్ప అనుబంధం ఉంది. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడి గురించి మాట్లాడే అవ‌కాశం అదృష్టం ద‌క్కినందుకు అదృష్టంగా భావిస్తున్నా. మ‌ధు గారి 93వ పుట్టిన‌రోజు ఇది. వందో పుట్టిన‌రోజు ఇలానే ఘ‌నంగా జ‌రుపుకుంటామ‌ని ఆశిస్తున్నాను`` అని రాజీవ్ క‌న‌కాల అన్నారు.

మ‌ద్రాసు నుంచే ఆర్టిస్టుల్ని తెచ్చుకోవాలా? అన్న ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. విద్యార్థుల‌తోనే ఇనిస్టిట్యూట్ సంద‌డిగా ఉండేది. ఇప్ప‌టికీ ఆ వేడుక క‌నిపిస్తోంది. ఆయ‌న‌ ఆత్మ ఇంకా ఇండ‌స్ట్రీ కోసం త‌ప‌న ప‌డుతోంది అంటూ మ‌ధుసూధ‌న్ రావు కుమార్తె వాణీ ఉద్వేగానికి లోన‌య్యారు.


Tags:    

Similar News