కొన్ని సినిమాలకు రియల్ ఇన్సిడెంట్స్ ఇన్‌స్పిరేషన్. నిజఘటనలతో సినిమా తీస్తున్నారంటే ఆ క్యూరియాసిటీయే వేరుగా ఉంటుంది. సౌత్‌లో అలాంటి క్యూరియస్ సినిమాలెన్నో ఇటీవల తెరకెక్కాయి. విచిత్రంగా ఈ సినిమాలు తెరకెక్కాక కూడా అలాంటి ఘటనలు కొన్ని పునరావృతమయ్యాయి. వాటిపై ఈ స్పెషల్ ఫోకస్..
మలయాళ హిట్ చిత్రం దృశ్యం తెలుగు, తమిళ్, హిందీ మూడుచోట్లా రీమేకై ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా కథాంశం కొన్ని నిజఘటనల ఆధారంగా రాసుకున్నది. ఓ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన కొన్ని ఆశ్చర్యకర నిజాలు ప్రేరణతో తెరకెక్కించారు. ఓ అందమైన కుటుంబం. అందులో అందమైన టీనేజర్. కోరిక తీర్చాల్సింది అంటూ ఓ ఆకతాయి ఎటెంప్ట్. అటుపై ఆ కుర్రాడి హత్య. మర్డర్‌ని దాచిపెట్టి కుటుంబమంతా నాటకం.. ఇదీ సింపుల్‌గా దృశ్యం సినిమా కథ. అయితే ఈ సినిమా 2013లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే ఓ చోట పునరావృతమైంది. 30మే, 2005లో నటాలీ అనే అమెరికన్ టీనేజర్ మిస్సయ్యిందంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అరూబా (డచ్ దీవుల్లో) అనే చోటికి స్కూల్ గ్రాడ్యుయేషన్ ట్రిప్‌కి వెళ్లిన సదరు అమ్మాయిని ఒక కామాంధుడైన స్టూడెంట్ వెంబడించాడు. పాడుబడిన ఓ భవంతి లాంటి చోటికి తీసుకెళ్లి బలాత్కారం చేయబోయాడన్నది రియల్ స్టోరి. అయితే ఆ తర్వాత నటాలీ మిస్సయ్యింది. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును 2015లో క్లోజ్ చేశారు. అప్పటికి గానీ అన్ని ఆధారాలతో నింధితుడిని పట్టుకోలేకపోయారు. అయితే దృశ్యం కథ కూడా ఓ రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్‌స్పయిర్ అయ్యి రాసుకన్నదే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన కథతోనే తెరకెక్కించారు.
ఇదే తీరుగా సూర్య కథానాయకుడిగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రక్తచరిత్ర' గ్యాంగ్ వార్‌ల నేపథ్యంలోని సినిమా. ఫ్యాక్షన్, కక్షలకు సంబంధించిన కథాంశం. ఇది కూడా నిజజీవితాలకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించినదే. పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, భానులాంటి ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన కథాంశం. రక్తచరిత్ర 1 (2010 అక్టోబర్‌లో రిలీజైంది) టైమ్‌కి సూరి బతికే ఉన్నాడు. పార్ట్ 2తెరకెక్కే సమయంలో (2011 జనవరి)నే హత్యకు గురయ్యాడు. కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అని రామూ పాడినట్లే రియల్ లైఫ్‌లోనూ జరిగింది.
గౌరీ శంకర్ అలియాస్ ఆటో శంకర్ అనే ఒక ఆసామి ఇంట్లోని ఐదుగురిని చంపి సిమెంటు గోడలో పాతేశాడు. అయితే హత్యలకు కారకుడైనందుకు తనలో తనే మదనపడి చివరికి పోలీసులుకు తనే హంతకుడిని అని చెప్పేసే వరకూ ఆ నిజం తెలియలేదు. 1995లో కోర్టు తీర్పు వెలువరించి ఉరి తీసింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 1988 నుంచి 89 ప్రాంతంలో. అయితే దీనికంటే ముందే అదే తరహా కథాంశంతో ఓ తమిళ సినిమా తెరకెక్కింది. నూరవత నాళ్ అనేది టైటిల్. కోకిల మోహన్, విజయ్‌కాంత్, నళిని ప్రధానపాత్రధారులు. తమిళనాట బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది.
కమల్‌హాసన్ విశ్వరూపం చిత్రంలో ఓ పావురం బాంబులు తయారు చేసే చిన్న సైజు రేడియో యాక్టివ్ పెలోడ్ ప్రదార్థాలు మోసుకెళ్తుంది. అది తీవ్రవాదులకు సహకరిస్తుంది. సరిగ్గా ఇదే ఇన్సిడెంట్ ఆ తర్వాత ఇండో పాక్ బోర్డర్‌లో జరిగింది. ఓ పావురం రెక్కలకు తగిలించిన ఉత్తరం దొరికింది. అది ఓ టెర్రరిస్టు పంపించిన స్పై అనుకుని బెదిరిపోయారు. కానీ అదేం లేదని తేలింది. 2013 జనవరిలో విశ్వరూపం రిలీజైంది. 2015 మేలో ఇన్సిడెంట్ జరిగింది.
ఇలాంటి ఆసక్తికర సంఘటనలు ఎన్నో. సినిమాలో వచ్చేశాక.. జరిగిన ఘటనలు. ఇంట్రెస్టింగ్ కదూ!