కోలీవుడ్ కి ఆయన మరణం షాక్

Update: 2017-11-10 06:56 GMT
ట్యాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ప్రియన్.. హార్ట్ అటాక్ తో హఠాత్తుగా మరణించడం కోలీవుడ్ ను కలచి వేస్తోంది. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన.. గురువారం నాడు తన ఇంటిలోనే మరణించారు. కోలీవుడ్ లో దాదాపు 30 సినిమాలకు కెమేరా బాధ్యతలు అందించిన ఆయన మరణం.. సినీ రంగానికి తీరని లోటు అని సినీ ప్రముఖులు అంటున్నారు.

నిన్నటి నుంచి ప్రియన్ కు నివాళులు అర్పిస్తున్న కోలీవుడ్.. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియ చేస్తోంది. పలు చిత్రాలకు ప్రియన్ పని చేసినా.. దర్శకుడు హరితో ఈయనకు అనుబంధం ఎక్కువ. ఇప్పటివరకూ 13 చిత్రాలకు హరితో కలిసి పని చేసిన ఈయన.. ఈ నెల 19 నుంచి సామి స్క్వేర్ చిత్రం పనులు ప్రారంభించాల్సి ఉంది. గతంలో విక్రమ్ హీరోగా వచ్చిన సామి చిత్రానికి ఇది సీక్వెల్ కాగా.. ప్రియన్ మరణం కారణంగా ఇప్పుడు సామి టీం ఎంతో ఉద్వేగానికి గురైంది. ఒకవేళ సినిమా ప్రారంభించి ఉంటే.. హరితో ఈయనకు 14వ చిత్రం అయేది.

 ప్రియన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యా పిల్లలు ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజీవ్ మీనన్ కు అసిస్టెంట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించారు ప్రియన్. ఈయన అసలు పేరు నాగేంద్రన్ కాగా.. 1997లో వచ్చిన పోర్కాలం చిత్రం నుంచి తన స్క్రీన్ నేమ్ ను ప్రియన్ గా మార్చుకున్నారు.
Tags:    

Similar News