టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. చై సామ్ విడిపోడానికి కారణాలు ఇవేనంటూ విశ్లేషణలు చేస్తూ.. అభ్యంతరకరమైన థంబ్ నైల్స్ పెట్టి కథనాలు ప్రసారం చేశాయి. ఈ క్రమంలో కొందరు సమంత వ్యక్తిగత జీవితం గురించి హద్దుమీరి ప్రవర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సామ్.. పలు ఛానల్స్ తో పాటు డాక్టర్ సీఎల్ వెంకట్రావు పై కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కూకట్ పల్లి కోర్టు.. రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు మరియు డాక్టర్ సీఎల్ వెంకట్రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీల్లేదని.. వెంటనే సంబంధిత కంటెంట్ ని తొలగించాలని ఇంజక్షన్ ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీఎల్ వెంకట్రావు స్పందించారు.
ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన సీఎల్ వెంకట్రావు.. కంటెంట్ ప్రొవైడ్ చేసేది తామే అయినా ఈ థంబ్ నెయిల్స్ పెట్టేవారు వేరే ఉంటారని పేర్కొన్నారు. కంటెంట్ ప్రొవైడర్స్ చేసేవాళ్ళు థంబ్ నైల్స్ వేయరని.. టైటిల్స్ విషయంలో తమకు ఎటువంటి బాధ్యత ఉండదని స్పష్టం చేశారు. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ - హెడ్డింగ్స్ ఇచ్చేందుకు ఎస్ఈవో అనే టీమ్ ప్రత్యేకంగా పని చేస్తుందని.. వారు ఏ టైటిల్ పెడతారో.. ఎలాంటి ఫొటోలు వాడుతున్నారు అనేది తమకు తెలియదని పేర్కొన్నారు. థంబ్ నైల్స్ పెట్టే ముందు కనీసం తమకు వాటిని చూపించరని వెంకట్రావు చెప్పుకొచ్చారు.
కాగా, సమంత విడాకుల వ్యవహారం మీద సీఎల్ వెంకట్రావు మాట్లాడిన వీడియో యూట్యూబ్ లో ''అబార్షన్, వ్యామోహమే విడాకులకు దారి తీసింది'' అనే థంబ్ నెయిల్ తో అప్ లోడ్ చేయబడింది. అలానే మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ లో పలు అభ్యంతరకర టైటిల్స్ తో సామ్ గురించి వీడియోలు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగేలా ప్రచారమైన తప్పుడు కథనాలను యూట్యూబ్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్స్ ఇవ్వాలని సమంత కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. సమంతకు ఊరట కలిగించేలా తీర్పు చెప్పింది.