మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వస్తోంది అంటే అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. నెలరోజులు ముందుగానే సంబరాలు మొదలైపోయేవి. కానీ ఈసారి క్రైసిస్ కారణంగా ఆ దూకుడు నెమ్మదించినట్టే కనిపిస్తోంది. అసలే హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో మహమ్మారీ విజృంభిస్తోంది. ఆ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే సోషల్ మీడియాల్లో మెగా అభిమాన సంఘాలు మాత్రం బాస్ బర్త్ డే హంగామాను కొనసాగించేందుకు సంసిద్ధంగానే ఉన్నాయని అర్థమవుతోంది.
ఇటీవల కరోనా క్రైసిస్ ఆరంభ దశలోనే మెగాస్టార్ చిరంజీవి రక్తదానం కోసం పిలుపునిచ్చారు. తలసేమియా సహా యాక్సిడెంట్ కేసుల్లో మరణాలకు చలించిపోతూ ఆయన ఇంతకుముందు అభిమానులు రక్తదానం చేయాలని కోరారు. తాను.. తన కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేశారు. ఇదే స్ఫూర్తితో పలువురు రక్తదానానికి ముందుకొచ్చారు. అదంతా అలా ఉంచితే ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏం ఉంటాయి? అన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
ఆరోజు అభిమానులు యథావిథిగా రక్త దాన శిబిరాల్ని నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. అలాగే చిరు బర్త్ డే రోజున అభిమానులకు కొన్ని అరుదైన కానుకలు అందనున్నాయి. వాటిలో ఆచార్య ఫస్ట్ లుక్ .. అలాగే లూసీఫర్ రీమేక్ కి సంబంధించిన ప్రకటన ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. లూసీఫర్ చిత్రానికి దర్శకుడు ఎవరు? అన్నది ఆరోజే ప్రకటించనున్నారట.
మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన లూసీఫర్ రాజకీయాల నేపథ్యంలో ఆసక్తికర చిత్రం. ఇందులో చిరంజీవి సహా మరో స్టార్ కి అవకాశం ఉంటుంది. యువదర్శకుడు సుజీత్ స్క్రిప్టు వర్క్ చేశారు. ఆయనకే దర్శకత్వం వహించే అవకాశం ఉంటుందని చాలా కాలంగా ప్రచారమైంది. మధ్యలో వీ.వీ.వినాయక్ రంగ ప్రవేశం చేసారని.. దర్శకుడు మారారాని ప్రచారం సాగుతోంది. దీనిపై చిట్టిబాబు ఫోటోని షేర్ చేసిన చరణ్ వింటున్నవన్నీ నిజాలే నంటూ కౌంటర్ కూడా వేశారు. అందుకే లూసీఫర్ సస్పెన్స్ అంతకంతకు ఉత్కంఠ పెంచుతోంది. బర్త్ డే కానుకలేమిటో మెగాస్టార్ సామాజిక మాధ్యమాల్లో లీకులిస్తారేమో చూడాలి.