సహాయ దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు నటుడిగా రూపాంతరం చెంది దర్శకరత్న దాసరి నారాయణరావు ఆశీస్సులతో హీరోగా ఎదిగారు. దశాబ్ధాల పాటు హీరోగా నిర్మాతగా అనుభవం ఘడించారు. కెరీర్ లో ఎన్నో భారీ విజయాలను అందుకున్నారు. అయితే ఎంబీ దర్శకుడిగా అరంగేట్రం చేస్తారని చాలా కాలం క్రితం వార్తలు వచ్చాయి. అది నిజమా...? అందుకు మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నారా? అంటే అతడు ఊహించని షాకింగ్ కామెంట్ ని చేశారు. ``నేను దర్శకుడిగా సినిమా ప్రారంభిస్తే.. టీమ్ అందరికి త్వరగా కోపం పోతుంది కాబట్టి అది పూర్తవుతుందేమో అని భయపడుతున్నాను`` అంటూ ఛమత్కరించారు.
ఎంబీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. సమయానికి సెట్స్ కి రాకపోతే ఆర్టిస్టుకు ఇక బడితె పూజ ఉంటుంది. అందుకే ఆయన సరదాగా అలా కామెంట్ చేశారు. కేవలం ఇతరులకు చెప్పడమే కాదు. అతను ఎల్లప్పుడూ సెట్స్ లో సమయపాలనతో ఉంటారు. ఆలస్యం ఆయనకు తెలియదు. ఇతరుల నుండి అదే ఆశిస్తాడు. ఆర్టిస్ట్ లేదా టెక్నీషియన్ సమయానికి సెట్స్ కి రాకపోతే నాకు కోపం వస్తుంది. అందుకే నేను దర్శకత్వం గురించి ఆలోచించడం లేదు అని నిర్మొహమాటంగా చెప్పారు.
అయితే దర్శకుడిగా తెరపైకి తీసుకురావాలనుకున్న కథ సిద్ధంగా ఉంది. నేను ఎప్పుడు చేస్తానో నాకు తెలియదని అన్నాడు. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్రతో ఆకట్టుకున్నారు. ఆయన నటిస్తున్న `సన్ ఆఫ్ ఇండియా` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది.