నువ్వు ఏమైనా పతివ్రతవ అంటున్న హీరోయిన్‌

Update: 2020-07-21 05:45 GMT
తమిళ హీరోయిన్‌.. బిగ్‌ బాస్‌ ఫేం వనిత విజయ్‌ కుమార్‌ గురించి ఈమద్య రెగ్యులర్‌ గా మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇటీవల ఆమె మూడవ పెళ్లి చేసుకుంది. వనిత మూడవ పెళ్లి విషయంలో ప్రస్తుతం తమిళ మీడియాలో రచ్చ జరుగుతోంది. వనిత పెళ్లి చేసుకున్న వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఆమె తనకు విడాకులు ఇవ్వకుండా వనితను వివాహం చేసుకున్నాడు అంటూ మీడియా ముందుకు రావడంతో వివాదం ప్రారంభం అయ్యింది.

విడాకులు తీసుకోని వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకుంటావు అంటూ తమిళ సినీ రంగానికి చెందిన కొందరు వనితను ప్రశ్నించారు. వారిలో ముఖ్యంగా లక్ష్మీ రామకృష్ణన్‌ మరియు కుట్టి పద్మిని ఉన్నారు. తాజాగా లక్ష్మీ రామకృష్ణన్‌ మరియు వనితలు ఒక లైవ్‌ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరి మద్య ఉన్న వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనుకుంటే లైవ్‌ లో ఆ చర్చ శృతి మించి ఇద్దరి మద్య మాటల యుద్దమే జరిగింది. చర్చకు పిలిచిన లక్ష్మీ రామకృష్ణన్‌ ను మాట్లాడకుండా వనిత రెచ్చి పోయింది.

నేను పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటీ అంటూ ప్రశ్నించింది. గతంలో తాను ఏదో కారణాల వల్ల నేను విడాకులు ఇచ్చాను. నన్ను తప్పు అనడానికి నువ్వు ఏమైనా మద్రాస్‌ హైకోర్టు జడ్జ్‌ అనుకుంటున్నావా అంటూ గట్టిగా ప్రశ్నించింది. ఈ రచ్చ అంతా లైవ్‌ లో జరిగింది. వనిత దూకుడుగా మాట్లాడటంతో లక్ష్మీ రామకృష్ణన్‌ వెళ్లి పోయింది. మళ్లీ ఆమె కొద్ది సమయం తర్వాత వచ్చి వనితను ఏదో ప్రశ్నించబోగా ఆ సమయంలో ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా అంటూ ప్రశ్నించింది.

నీవు ఉన్న ఇండస్ట్రీలోనే నేను ఉన్నాను. నీ బండారం అంతా నాకు తెలుసు. నీ షో ద్వారా సంసారాలను నాశనం చేస్తున్నావు తప్ప మరేం లేదు. నీ గురించి ఎవరికి తెలియదని నీవు అనుకుంటున్నావు. కాని నేను మాత్రం నీ గురించి అన్ని విషయాలను బహిర్ఘతం చేస్తానంటూ హెచ్చరించింది. మొత్తానికి వీరిద్దరి మద్య చర్చ రచ్చ రచ్చ అయ్యింది.
Tags:    

Similar News