అ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్..?

Update: 2020-02-24 15:30 GMT
వారిద్దరూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు.  ఒకరేమో వరస విజయాలతో దుమ్ములేపి స్టార్ అయ్యాడు.  ఈమధ్య ఫ్లాపులు వస్తున్నాయి. మరొకరేమో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్టుగా అనతికాలంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ క్రేజీ హీరో దెబ్బకు ముందుగా మీడియం రేంజ్ హీరోల్లో టాప్ అనిపించుకున్న హీరో స్థానానికి ఎసరు వచ్చింది.  ఈ ఇద్దరు పైకి స్నేహితులుగా కవరింగ్ ఇస్తున్నారట కానీ లోపల మాత్రం కోల్డ్ వార్ జరుగుతోందని అంటున్నారు.

నిజానికి ఇద్దరికీ సీ సెంటర్లలో మార్కెట్ లేదు. ఆ క్రేజీ హీరోకు సీ తో పాటు బీ సెంటర్లలో కూడా వీకే.  అయితే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా లేని ఈ హీరోలు బయట మాత్రం లేనిపోని హైప్ సృష్టిస్తున్నారట.  ఈ ఇద్దరి హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ అంటూ కృత్రిమంగా ఈ హడావుడి చేయిస్తున్నారట.  ఈ హీరోలు నటిస్తున్న సినిమాల నిర్మాణ సంస్థలు కొందరు ఉద్యోగులను నియమించి మరీ ఈ ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ చేయిస్తున్నారని ఫిలిం నగర్ టాక్.  ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ హీరోలిద్దరూ ఇలా చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉన్నారట.  

ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి ఈగో క్లాషెస్ వచ్చాయని అంటున్నారు. ఆ క్రేజీ హీరో సినిమా ఈమధ్య బోల్తా కొట్టడంతో మరో హీరో.. ఆయన టీమ్ బోల్తా పండగ జరుపుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ కోల్డ్ వార్ సంగతి తెలిసిన ఇండస్ట్రీ సీనియర్లు కథలపై.. నటనపై దృష్టి పెట్టకుండా ఈ చెత్తపనులు ఎందుకని అంటున్నారు.  ఈ మీడియం రేంజ్ హీరోలకు ఆ విషయం ఎప్పుడు అర్థం అవుతుందో.. ఎప్పుడు ఈ ఫేక్ రచ్చలను వదిలిపెట్టి టాప్ రేంజికి వెళ్తారో మరి.  


Tags:    

Similar News