కొత్త కమెడియన్ మెప్పిస్తాడా?

Update: 2018-06-26 17:30 GMT
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ సెకండ్ సినిమాను ఫైనల్ గా రెడీ చేశాడు. రీసెంట్ గా ఈ నగరానికి ఏమైంది  ప్రీ రిలీజ్ ను గ్రాండ్ గా చేసిన చిత్ర యూనిట్ అందరిని ఆకట్టుకుంది. ఇక పెళ్లి చూపులు సినిమా ఎలాంటి విజయం అందుకుందో అందరికి తెలిసిందే. ఎక్కువగా ఆ సినిమాలో కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా సరికొత్త కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఆ సినిమాలో ప్రియదర్శి పంచులు హావభావాలు చాలా వరకు క్లిక్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న మరొక కమెడియన్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్ అనే కొత్త కమెడియన్ పాత్ర చాలా హైలెట్ గా నిలుస్తుందని అర్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్ లో మనోడు చాలా ఆకర్షించాడు. అతను వేసిన పంచ్ లు చూస్తుంటే సినిమాలో కామెడీకి కొదవలేదు అన్నట్టుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమాలో అతను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. మరి సినిమాలో మొత్తంగా మనోడి క్యారెక్టర్ ఎంతవరకు మెప్పించగలుగుతుందో చూడాలి. ఈ శుక్రవారం నిర్మాత సురేష్ బాబు సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు రెంజ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.  
Tags:    

Similar News