దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే సామెత సినిమా పరిశ్రమకు అతికినట్టు సరిపోతుంది. ముఖ్యంగా మంచి పొజిషన్ లో ఉన్న హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు తాము ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే కొడుకులను తమ్ముళ్లను పరిచయం చేసి సెటిల్ చేయటం అనేది చాలా మామూలు విషయం. నటసార్వభౌమ ఎన్టీఆర్ మొదలుకుని విజయ్ దేవరకొండ దాకా అందరూ చేసింది ఇదే. ఇప్పుడు ఈ వరసలో ఆలీ కూడా నిలుస్తున్నాడు. కాకపోతే కొద్ది ఆలస్యంగా. తమ్ముడు ఖయ్యుమ్ ని హీరోగా పెట్టి నిర్మాణమవుతున్న దేశంలో దొంగలు పడ్డారు అనే సినిమాకు ఆలీనే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ముందు వెనుక నుంచి నడిపిద్దాం అనుకున్నా చివరికి టైటిల్ కార్డ్స్ లో తన పేరు వేసుకునే దాకా వచ్చేసిందట. ట్రైలర్ లో ముందు ఆలీ పేరే కనిపిస్తుంది మరి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైం థ్రిల్లర్ లో మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయండోయ్.
గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సమీర్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ఇదే టైటిల్ తో రజనీకాంత్ సుమన్ విజయశాంతిలతో ఒక సూపర్ హిట్ మూవీ వచ్చింది. మళ్ళి ఇన్నాళ్లకు ఈ పేరుతో ఆలీ తమ్ముడు వస్తున్నాడు. ఖయ్యుమ్ ఇలా ప్రయతించడం ఇది మొదటిసారి కాదు. గతంలో స్టార్ హీరోలందరితో చిన్న చిన్న పాత్రలు చాలానే చేసాడు. నాగార్జున సూపర్ లాంటివాటిలో మంచి ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. కాని అన్నయ్య ఆలీలాగా హీరోగా మాత్రం ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. ఇంత లేట్ గా తమ్ముడిని లిఫ్ట్ చేయాలనే ఆలోచన మంచిదే కానీ ఖయ్యుమ్ ని ప్రేక్షకులు ఎంతవరకు సోలోగా రిసీవ్ చేసుకుంటారు అనేది విడుదల అయ్యాకే తెలుస్తుంది.