కమెడియన్ అలీ వెండితెర.. బుల్లితెర కెరీర్ గురించి తెలిసిందే. టాలీవుడ్ లో మూడు దశాబ్ధాలు పైగా హాస్యనటుడిగా హవా సాగించిన అలీ హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించారు. యమలీల లాంటి బ్లాక్ బస్టర్ లో హీరోగా నటించి మెప్పించాడు. ఓవైపు పెద్దతెరపై నటిస్తూనే మరోవైపు బుల్లితెరపైనా పాపులరయ్యారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి వైయస్సార్ కాంగ్రెస్ కి ప్రచారం చేశారు. ప్రస్తుతం అలీకి ఏపీ ఫిలిమ్ టీవీ అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీ-ఎఫ్ డీసీ) బాధ్యతల్ని అప్పగించనున్నారంటూ ప్రచారం సాగుతోంది.
అదంతా అటుంచితే బుల్లితెరపై `అలీతో సరదాగా` కార్యక్రమం ఎంత పాపులరైందో తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం 150 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముందు `అలీ 369` సైతం బుల్లితెరపై 143 ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యింది. ఆ రెండిటినీ జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించి ఎయిర్ చేసింది. అయితే అలీ బుల్లితెర ప్రవేశానికి కారణమైంది కూడా ఇదే సంస్థ. అతడు టీవీ అంటే అనాసక్తిగా ఉంటే సదరు సంస్థనే అతడిని ఎటూ కదలకుండా లాక్ చేసిందట.
అలీకి పెద్ద తెరపై అవకాశాల్లేక టీవీ కెరీర్ వెతుక్కున్నారంటూ ప్రచారమైంది. కానీ టీవీ రంగంపై అంత ఆసక్తి లేకపోయినా సదరు సంస్థ నిర్వాహకులతో సాన్నిహిత్యం.. వాళ్లు ప్రారంభించిన కార్యక్రమాలకు హోస్టింగ్ చేయాలని లాక్ చేయడంతో అలీకి తప్పలేదట. పారితోషికం పరంగానూ గిట్టుబాటు కావడంతో అప్పట్లో సై అనేశారట. `డ్యాన్స్ బేబి డ్యాన్స్` టీవీ తెరపై పాపులరైన సమయంలోనే `అలీ 369` కార్యక్రమం మొదలైంది. యితే అలీ అస్సలు టీవీకి ససేమిరా అనేస్తుంటే తప్పదు అంటూ బతిమాలడంతో కేవలం 12 ఎపిసోడ్లు చేసేందుకు అంగీకరించారట. అయితే ఒకసారి షో ప్రారంభమయ్యాక తాను సంతృప్తి చెందకపోవడం వల్ల హోస్టింగ్ ను కొనసాగించారు. అలా ఆ షో 143 ఎపిసోడ్లకు ఆయన పని చేశారు. ఆ తర్వాత `అలీతో సరదాగా` ప్రారంభమై 150 ఎపిసోడ్లు అయ్యింది. ఇష్టం లేకపోయినా ఒకసారి అంటించాక అలా కంటిన్యూ అయ్యారన్నమాట. ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి బుల్లితెరను పట్టించుకునే సమయం ఉండకపోవచ్చన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.