ఆ నోట్లకు కమెడియన్ బుక్కయ్యాడే!!

Update: 2016-11-16 09:19 GMT
టాలీవుడ్ లో ఆయనో పేద్ద కమెడియన్. సరిగ్గా మాట్లాడితే స్టార్ కమెడియన్ అనాలి. ఈ మధ్య ఈయనకు ఛాన్సులు ఇచ్చేవారు కనిపించడం లేదు కానీ.. కామెడీ పండించడంలో.. స్టేజ్ పెర్ఫామెన్సులు ఇవ్వడంలో బోలెడంత అనుభవం ఉంది. ఈయనకు గాలి వారి పెళ్లిసందడిలో పాల్గొనాలని.. తనవంతుగా ప్రదర్శన ఇవ్వాలంటూ.. కొన్ని వారాల క్రితమే భారీ ఆఫర్ తలుపు తట్టిందట.

ఒకే ఒక్కసారి చేసే పెర్ఫామెన్స్ కి 15 లక్షల రూపాయల భారీ పారితోషికం.. బిజినెస్ క్లాస్  ఫ్లైట్ టికెట్లు.. ఫైవ్ స్టార్ హోటల్ లో 2-3 రోజుల బస.. ఫేడవుట్ అయిపోయే పరిస్థితిలో ఉన్న నటుడికి ఇంతకంటే మంచి ఆఫర్ ఉంటుందా? అందుకే ఆనందంగా ఒప్పేసుకున్నాడు కానీ.. ఇప్పుడు నోట్ల వ్యవహారం దెబ్బ కొట్టేసింది. చేతి నిండా నోట్లు ఉన్నా మార్చుకోలేడు. రోజుల వ్యవధిలోకి వచ్చాక తూచ్ రావట్లేదు అని ప్రోగ్రాం రద్దు చేసుకోలేడు. కొన్ని వారాల క్రితమే తీసుకున్న అమౌంట్ కావడంతో.. డబ్బులు తీసేసుకుని చెక్ ఇవ్వాలని అడగలేడు. మొత్తం మీద గట్టిగానే ఇరుక్కున్నాడట కమెడియన్.

ఏం చేయాలో అర్ధం కాక.. చివరకు ప్రోగ్రాం ఫినిష్ చేసి ఆ తర్వాత ఏమైనా తరుణోపాయం ఆలోచించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. పాపం.. ఈయనకింకా సమస్యలు తీరలేదే అనుకుంటున్నారు సన్నిహితులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News