వైయస్సార్ పాదయాత్ర, ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా `యాత్ర`. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు రిలీజవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది? ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తుందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఇప్పటి వరకూ యాత్ర గురించి ఇన్‌సైడ్ టాక్ కానీ, సరైన అప్ డేట్ కానీ రివీల్ కాలేదు.
అసలు యాత్ర ఎలా ఉండబోతోంది? అని ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించిన 30 ఇయర్స్ పృథ్వీ ని ప్రశ్నిస్తే .. ఏపీ ఎన్నికల ముందు షేకాడించే సినిమా ఇదని- బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని చెప్పాడు. ఈ చిత్రం లో ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు? అన్న ప్రశ్నకు.. తెలుగు దేశం పార్టీ లో ఉండి వైయస్సార్ గురించి ఎత్తేసే ఎమ్మెల్యే పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యే గా నటిస్తారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర అప్‌డేట్ అందించారు.
ఊపిరి ఉన్నంతవరకూ వైయస్ అభిమాని గా, జగన్ అభిమాని గానే ఉంటాను. వచ్చే ఎన్నికలకు ఫిబ్రవరి లో నోటిఫికేషన్ రిలీజవుతోందని తెలుస్తోంది. ఈ సారి పార్టీ క్యాంపెయినింగ్ కి పెద్ద ఎత్తున ఆర్టిస్టులు బరిలో దిగుతున్నారని తెలిపారు. ఇంకొద్ది రోజుల్లోనే ఏపీ ఎలక్షన్స్ గురించి, సెలబ్రిటీ ప్రచారం గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయని షాకిచ్చే విషయం చెప్పారు. అతడి మాటల్ని బట్టి రానున్న ఎన్నికల్లో వైకాపా పార్టీ తరపున భారీ గా స్టార్ కాంపెయినింగ్ ఉండబోతోందని అర్థమవుతోంది. పృథ్వీ సైతం జగన్ తరపున పార్టీకి ప్రచారం చేయనున్నారు. ఇకపోతే తాను ఎమ్మెల్యే గా పోటీ చేయబోనని పృథ్వీ అన్నారు. 2013 నుంచి నేను వైయస్సార్ పార్టీ తో అనుబంధం కలిగి ఉన్నానని, అయితే అందరికీ తెలీదని పృథ్వీ తెలిపారు.