థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీని భ‌ర‌ణం ఇవ్వ‌మ‌న్న కోర్టు

Update: 2017-06-29 06:58 GMT
ఒక్క డైలాగ్ తో తిరుగులేని హాస్య‌న‌టుడిగా మారిన న‌టుడిగా పృథ్వీ రాజ్‌ను చెప్పాలి. ఇక్క‌డ థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ అత‌ను చెప్పిన డైలాగ్ అత‌నికి స‌రికొత్త గుర్తింపును ఇవ్వ‌ట‌మే కాదు.. టాలీవుడ్ హాస్య‌న‌టుల్లో అత‌నికో ఐడెంటినీని తెచ్చింది. ఇదంతా ఆయ‌న వృత్తికి సంబంధించిన విష‌యాలు. ఇక‌.. ఆయ‌న వ్య‌క్తిగ‌త విష‌యంలోకి వెళితే.. తాజాగా విజ‌య‌వాడ ఫ్యామిలీ కోర్టు ఆయ‌న‌కు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్ర‌కారం ఆయ‌న త‌న భార్య‌కు నెల‌కు రూ.8ల‌క్ష‌లు భ‌ర‌ణంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకిలా? అన్న విష‌యంలోకి వెళితే..

విజ‌య‌వాడ‌లోని అరండ‌ల్ పేట‌కు చెందిన 47 ఏళ్ల శ్రీల‌క్ష్మిని న‌టుడు శేషు అలియాస్ మూర్తి అలియాస్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ 1984లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. పెళ్లి స‌మ‌యానికి శ్రీల‌క్ష్మి త‌ల్లిదండ్రులు విజ‌య‌వాడ‌లో మిఠాయి దుకాణం నిర్వ‌హించేవారు.

తండ్రి చ‌నిపోవ‌టంతో శ్రీల‌క్ష్మి.. పృథ్వీరాజ్ లు కొంత కాలం ఆ షాపును నిర్వ‌హించారు. ఆ టైంలో న‌ట‌న మీద ఉన్న ఆస‌క్తితో పృథ్వీ రాజ్ త‌ర‌చూ చెన్నై వెళ్లి వ‌స్తుండేవారు. క్ర‌మంగా సినిమా రంగంలో రాణించ‌టంతో కాపురాన్ని హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేశారు. అయితే.. త‌ర్వాతికాలంలో పృథ్వీరాజ్ త‌ర‌చూ శ్రీల‌క్ష్మితో గొడ‌వ‌పడేవాడ‌ని.. గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఇంటి నుంచి పంపించేశార‌ని చెబుతున్నారు. దీనిపై పెద్ద‌మ‌నుషులు దంప‌తుల మ‌ధ్య రాజీ చేసేందుకు ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. చివ‌ర‌కు గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌రులో సూర్యారావు పోలీస్ స్టేష‌న్‌లో శ్రీ‌ల‌క్ష్మి భ‌ర్త మీద ఫిర్యాదు చేశారు.

త‌న భ‌ర్త ఆదాయ‌ప‌రిస్థితి బాగానే ఉన్నందున జీవ‌నోపాధికి అత‌ని నుంచి నెల‌కు రూ.10 లక్ష‌లు ఇప్పించాల్సిందిగా కోరు ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. కోర్టు పంపిన స‌మ‌న్ల‌కు పృథ్వీ అందుకోక‌పోవ‌టంతో బాధితురాలు హైద‌రాబాద్ లో పేప‌ర్ ప్ర‌క‌ట‌న ద్వారా నోటీసు ఇచ్చారు. కేసు వాయిదాకుహాజ‌రు కాని నేప‌థ్యంలో న్యాయ‌మూర్తి స్పందిస్తూ.. బాధితురాలికి నెల‌కు రూ.8 ల‌క్ష‌లు భ‌ర‌ణంగా చెల్లించాల‌ని చెబుతూ ఆదేశాలు జారీ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News