మళ్లీ మళ్లీ ఈ అంకెలేంటో బాబోయ్

Update: 2018-01-19 03:47 GMT
ఆయన ఓ సీనియర్ హీరో. టాలీవుడ్ సినిమా గురించి చెప్పుకుంటే.. ఆయన పేరు చెప్పకుండా పూర్తి కావడం కష్టం. ప్రస్తుతం ఈయన వారసులు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. వారసులే కాదు.. ఇప్పటికీ ఆయన కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం గడపడం అంటే ఎన్నో మైలు రాళ్లను అధిగమించడమే. అలాగే ఈయన ఖాతాలో చాలా రికార్డులే ఉంటాయి. ఓ ల్యాండ్ మార్క్ ఇయర్ పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా కొంతకాలం క్రితం ఓ భారీ ఈవెంట్ చేశారు. దీనికి ఇండస్ట్రీ నుంచి అనేక మంది ప్రముఖులు.. సీనియర్లు హాజరై.. ఆ హీరోను వేనోళ్ల ప్రశంసించారు. పాత విబేధాలను పక్కన పెట్టి మరీ పలువురు హాజరయ్యారు. ఇండస్ట్రీ అంటే అమితంగా ఇష్టపడే ఓ పెద్దాయన ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగానే జరిగింది. ఇంతవరకూ ఓకే అనుకుంటే.. రీసెంట్ గా అదే ఈవెంట్ కు ఓ అంకెను మార్చి మళ్లీ ఆర్భాటంగా ఓ వేడుక నిర్వహించారు.

ఇందులో ఈ హీరోకు కొత్త బిరుదును కూడా ఇచ్చి సత్కరించారు. ఆ బిరుదు పొందడానికి తగిన అర్హతలు అన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ బిరుదు కంటే.. ఈ ఈవెంట్ కు చేసిన అంకెల ప్రచారమే ఎక్కువగా కనిపించింది. మొన్నీ మధ్యేగా ఇంకో అంకె కనిపించింది అనుకున్నారు జనాలు. ఏడాది గడిచినపుడల్లా ఇలా ఈవెంట్లు జరుపుకుంటారా ఏంటి అనే కామెంట్స్.. వెనకాల వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News