విక్కీ కౌశల్ - సారా అలీ ఖాన్ నాయకానాయికలుగా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండోర్ లో చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రం కోసం ఇండోర్ వీధుల్లో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రొడక్షన్ హౌస్ కి చెందినదని ఆదివారం ఇండోర్ పోలీసులు తెలిపారు. తన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కి తప్పుడు సంఖ్యను ఉపయోగించారని ఆరోపిస్తూ విక్కీ కౌశల్ పై స్థానిక నివాసి ఫిర్యాదు చేయడంతో స్పష్టత వచ్చింది. ఇండోర్ నివాసి తన ద్విచక్ర వాహనం నంబర్ ను ఉపయోగించే ముందు ఆర్.టి.ఏ అనుమతి తీసుకోలేదనేది ఆరోపణ. విక్కీ కౌశల్ సారాతో కలిసి బైక్ నడుపుతున్న ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడంతో ఫిర్యాదు చేశారు. నంబర్ 1ని 4 లాగా చూపించే బోల్ట్ లుక్ కారణంగా గందరగోళం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.
``సినిమా సీక్వెన్స్‌లో ఉపయోగించిన వాహనం నంబర్ నాది.. ఈ విషయం చిత్ర యూనిట్ కి తెలిసిందో లేదో తెలియదు. ఇది చట్టవిరుద్ధం. అతను అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్ ఉపయోగించలేడు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి`` అని యాదవ్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు.
దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు పోలీసులు సినిమా సెట్స్ కు చేరుకున్నారు. సంఖ్యలు భిన్నంగా ఉన్నాయని వారు తెలుసుకున్నారు. నంబర్ ప్లేట్ పరిశోధనలో నంబర్ ప్లేట్ పై అమర్చిన బోల్ట్ ఫాంట్ వల్ల అన్ని అపార్థాలు సంభవించాయని పోలీసులు కనుగొన్నారు. బోల్ట్ ఫాంట్ కారణంగా నంబర్ వన్ నంబర్ ఫోర్ లాగా ఉంది. సినిమా సీక్వెన్స్ లో ఉపయోగించిన నంబర్ సినిమా ప్రొడక్షన్ కు చెందినది. అందువల్ల మా దర్యాప్తులో చట్టవిరుద్ధంగా ఏమీ జరగలేదు..అని బంగాంగమ్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజేంద్ర సోని చెప్పారు.
నంబర్ ప్లేట్ ను ఇన్ స్టాల్ చేయడానికి బోల్ట్ ఉపయోగించారని ప్రొడక్షన్ హౌస్ సభ్యుడు కూడా మీడియాకి చెప్పారు. ఈ నంబర్ ప్రొడక్షన్ హౌస్ సభ్యునిది. ఇటీవలే కత్రినా కైఫ్‌ను పెళ్లి చేసుకున్న విక్కీ కౌశల్ మధ్యప్రదేశ్ లో తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం హాజరు కావాల్సి ఉంది. మరోవైపు సారా అలీ ఖాన్ నటించిన అట్రాంగి రే ఓటీటీలో రిలీజై విజయం అందుకుంది.