టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో ఒకరు.. ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకొని సినిమాలు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓ మాస్ డైరెక్టర్ తో ఓ భారీ ద్విభాషా చిత్రం కోసం చేతులు కలిపాడు.
తన కెరీర్ లోనే ఫస్ట్ బైలింగ్విల్ కావడంతో హీరో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. స్టార్ క్యాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్ తో పాటుగా టాలెంటెడ్ యాక్టర్ ని ఈ సినిమాలోకి తీసుకున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ రేటుకు నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా విషయంలో అంతా బాగానే జరుగుతోందని అనుకుంటుండగా.. షూటింగ్ సమయంలో దర్శక హీరోల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
డైరెక్టర్ మరియు హీరో ఇద్దరికీ ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమనే చెప్పాలి. తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసిన నేపథ్యంలో.. ఈ మూవీతో కచ్చితంగా బాక్సాఫీస్ హిట్ కొట్టి విజయాల పరంపర కొనసాగించాలని ఆ యంగ్ హీరో కోరుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై హోప్స్ పెట్టుకున్నాడు.
మరోవైపు గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడికి అర్జెంట్ గా ఓ హిట్టు అవసరముంది. ఇంతకుముందు ఓ స్టార్ హీరోతో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ హీరోలు మరియు బడా నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ టైంలో హీరోకి డైరెక్టర్ కు మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చాయని అంటున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యం అయిందని చెబుతున్నారు. అయితే చిత్ర నిర్మాత దీంట్లో జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది.
నిర్మాత కలుగజేసుకున్న తర్వాతనే దర్శక హీరో ద్వయం తిరిగి షూటింగ్ ను ప్రారంభించడానికి రెడీ అయ్యారు. పెండింగ్ పోర్సన్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకొని.. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు దర్శక హీరోల మధ్య అంతా ఓకేనా కదా అనేది ప్రమోషన్స్ లో బయటపడే అవకాశం ఉంది.