గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య- సమంత జంట విభేధాల గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని కొందరైతే భరణం ఇంతా అంతా అంటూ ఒకటే కథనాలు అల్లేయడం .. ముందస్తు ఊహాగానాలు వేడి పెంచుతున్నాయి.
అయితే వీటిపై అక్కినేని నాగచైతన్య కానీ సమంత కానీ స్పందించలేదు. అలాగే ఈ సున్నిత విషయంపై అక్కినేని కుటుంబం కానీ సమంత వైపు వాళ్లు కానీ ఎక్కడా స్పందించిందే లేదు. కానీ చాలా చోట్ల ఊకదంపుడు ప్రచారం మాత్రం సాగిపోతోంది. చాలా ఊహాగానాలు చైతన్య అభిమానులను పూర్తిగా డైలమాలో పడేస్తున్నాయి.
మీడియా కథనాలు బాధించాయని ఓవైపు చైతన్య అంటున్నా.. ఇప్పటికీ ఏవీ ఆగడం లేదు. సీక్వెల్ కథనాలతో మీడియాలు విరుచుకుపడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా చైతన్య సైలెంట్ గా ఉండకుండా ఖండించాలని కొందరు కోరుతుండడం చూస్తుంటే .. కొన్ని విషయాల్లో బలవంతంగా రుద్దుతున్నారన్న వాదనా ఒక వర్గంలో వినిపిస్తోంది. కొన్ని మీడియాలు అతిగా టీర్పీ కోసం కథనాలు వేస్తూ నాగచైతన్య సోలో లైఫ్ మీద వీడియోలు వేస్తూ ప్రచారం చేయడంపై చైతన్య అభిమానులు మాత్రం గుర్రుమీదున్నారు. అయితే సాధ్యమైనంత తొందర్లోనే అన్ని ఊహాగానాలకు చెక్ పెడుతూ నాగచైతన్య .. సమంత ఏదో ఒక క్లారిటీ ఇస్తారని స్పెక్యులేషన్స్ సాగుతున్నాయి.