ప్రభుత్వంపై నిరసన పేరు రోడ్డెక్కి ప్రజలను ఇబ్బంది పెట్టేవారిపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రెటీలు కూడా తప్పుపట్టారు. భారత్ లో చాలా కాలంగా నిరసనల పేరుతో రోడ్డెక్కి ఇబ్బందులు కలుగుజేస్తున్న పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పౌరులకు నిరసనలు తెలిపే హక్కు ఎంత ఉందో.. ఇతరులకు ఇబ్బంది కలుగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజాగా ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ తాను వెళుతున్న దారిలో నిరసనలను వ్యతిరేకించి పాపం దెబ్బలు తినాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కేరళలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం కొచ్చిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎడపల్లి-వైటిల్లా జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. అదే సమయంలో కారులో అటుగా వెళుతోన్న మలయాళ నటుడు జోజు జార్జ్ ట్రాఫిక్ లో చిక్కుకున్నాడు. రోడ్డు క్లియర్ కాకపోవడంతో చాలా సేపు ఎదురుచూసి సహనం కోల్పోయి కారు దిగాడు. ప్రజల తరుఫున నిరసన తెలుపుతూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలతో వాదులాటకు దిగారు. నిరసన ముగించాలని కోరాడు.
దీంతో నటుడి తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు జోజును తోసిపారేసి ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు.తనపై దాడి చేశారంటూ నటుడు ఆరోపించాడు. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం జోజు మద్యం మత్తులో ఉన్నారని.. మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించారని.. అందుకే దాడి జరిగినట్లు పోలీసులకు రివర్స్ ఫిర్యాదు చేశారు.
జోజు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనను వైద్యపరీక్షలకు పంపారు. కారు అద్దాలు పగులగొట్టి దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యపరీక్షల రిపోర్టులు, సీసీటీవీ ఫుటేజ్ చూశాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది అన్నది తేలాల్సి ఉంది.