కామెంట్‌: మార్కెట్‌ కాదు, కంటెంట్‌ పెరగాలి

Update: 2015-07-22 04:11 GMT
'బాహుబలి' సినిమాతో ఒక్క విషయం తేటతెల్లం అయిపోయిది. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 200 కోట్ల గ్రాస్‌ ఈజీగా వచ్చేస్తుంది. అంటే దాదాపు 100 కోట్ల షేర్‌ వసూలు చేసుకోవచ్చు. కాని అందరికీ ఇది పాజిబుల్‌ అయ్యే పనేనా? ఓమారు ప్రశ్నించుకోండి...

రాజమౌళి తీసిన ఈ భారీ కాన్వాస్‌ సినిమాకు ఆది నుండీ మాంచి హైప్‌ ఉంది. అలా హైప్‌ వచ్చేలా చాలా జాగ్రత్తగా అన్నీ ప్లాన్‌ చేశాడు రాజమౌళి. మేకింగ్‌ వీడియో  నుండి కొన్ని గ్రాఫిక్‌ సీన్లు స్పెషల్‌ గా ఫిలిం ఫెస్టివల్స్‌ లో చూపించడం వరకు.. చాలానే ప్రయత్నించారు. దానితో సినిమాకు పేరొచ్చింది.. ఇకపోతే సినిమా రిలీజ్‌ అయ్యాక.. స్టోరీ ఎలా ఉన్నా కూడా.. ఆ విజువల్‌ ఎఫెక్టులకే జనాలు నోరు వెల్లబెట్టేశారు. సాంకేతికతకు తన సృజనాత్మకతను జోడించి రాజమౌళి అరచేతిలో ఇంద్రధనుస్సును చూపించేశాడు. ప్రేక్షకులకు అదే విపరీతంగా నచ్చేసింది. దానితో 200 కోట్ల గ్రాస్‌ అండ్‌ కౌంటింగ్‌ అన్నట్లుంది సినిమా పొజిషన్‌. మరి మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి?

పాయింట్‌ నెం.1.. అసలు సినిమాల్లో బీభత్సమైన కంటెంట్‌ ఉండాలి.. ఏదైనా సెన్సేషనల్‌ కొత్త పాయింట్‌ ఉండాలి. శ్రీమంతుడు సినిమాలో అదేదో ఊరిని దత్తత తీసుకోవడం అన్న రేంజులో ఏదైనా ఉండాలి. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవ్వాలి. అలాంటి కంటెంట్‌ ఉంటే మామూలు స్థాయి కంటే ఓ 20 కోట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్సుంది.

పాయింట్‌ నెం.2... సినిమాలకు సరైన ప్రమోషన్‌ చేయాలి. స్టార్‌ హీరోలు సినిమా ముందు ఒకటి, సినిమా రిలీజ్‌ అయ్యక రెండు ప్రెస్‌ మీట్లు అన్న చందాన కాకుండా, ఓ పది మార్లు బుల్లితెరపై కనిపిస్తే జనాలు ధియేటర్లకు పరిగెత్తుకుంటూ వచ్చే ఛాన్సుంది.

సో, మార్కెట్‌ ఒక్కటే కాదు.. కంటెంట్‌, ప్రచారం పెరిగితేనే మన సినిమాలు ఈజాగా 100 కోట్ల గ్రాస్‌ ను దాటి 200 వరకు వసూలు చేయగలిగేది.
Tags:    

Similar News